India-China Border:భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చైనా దురాక్రమణలను సైనిక బలగాలు అడ్డుకుంటున్నాయి. శాంతి చర్చలు ఎన్ని జరిగినా జిన్‌పింగ్ సేనల తీరు మారడం లేదు. దీంతో చైనాకు ధీటుగా భారత దళాలు సమాధానం ఇస్తున్నాయి. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి వివాదం సమిసిపోకపోవడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌ సరిహద్దుల్లో ఉన్న ఆరు డివిజన్లను భారత్-చైనా బోర్డర్‌కు తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో పాక్ సరిహద్దుపై భారత్ బలగాల దృష్టి అధికంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారడంతో చైనా నుంచి వచ్చే ముప్పును అడ్డుకునేందుకే సైన్యం తొలి ప్రాధాన్యత ఇస్తోంది.  ఈక్రమంలోనే బలగాల మోహరింపులో మార్పులు జరుగుతున్నాయి. ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు అమలు అవుతున్నాయి. ఇటీవల చైనా సరిహద్దుల్లో పర్యటించిన ఆయన..అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


గత రెండేళ్లుగా భారత్-చైనా వివాదం కొనసాగుతోంది. ఎన్ని చర్చలు జరిగినా..సమస్య కొలిక్కి రావడం లేదు. తాజా మార్పులతో జమ్మూ-కాశ్మీర్‌ ఉగ్రవాద కార్యకలాపాలను అణిచి వేసే రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ డివిజన్‌ తూర్పు లద్దాఖ్‌కు వెళ్లింది. ఇదివరకే అక్కడే మూడు డివిజన్లు పనిచేస్తున్నాయి. హర్యానాలోని స్ట్రైక్ కోర్ నుంచి ఓ డివిజన్‌ను ఉత్తరాఖండ్‌కు పంపారు. వన్ స్ట్రైక్ కోర్‌కు చెందిన మరో రెండు డివిజన్లు సైతం చైనా బోర్డర్‌కు తరలి వెళ్లాయి. గతంలో ఈ దళాలన్నీ పాక్ సరిహద్దుల్లో పనిచేసివని ఆర్మీ అధికారులు తెలిపారు.


Also read: Russia vs Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఒరిగిందేంటి..?


Also read: North Korea Corona: ఉత్తర కొరియాలో కరోనా టెర్రర్..హెల్త్ ఎమర్జెన్సీ విధింపు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook