Non Lethal Weapons: భారత-చైనా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు ఇక చెక్ పడవచ్చు. చైనా కవ్వింపు చర్యలకు దీటైన సమాధానమిచ్చేందుకు భారత ఆర్మీ సంసిద్దమవుతోంది. సంప్రదాయ ఆయుధాలన్ని సమకూర్చుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2020 జూన్ 14 అర్దరాత్రి జరిగిన ఆ సంఘటన ఇండియన్ ఆర్మీకు(Indian Army)విషాదాన్ని మిగిల్చిన ఘటన. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ..గాల్వాన్ లోయలో(Galwan Valley)ఎల్‌ఏసీ వెంబడి ఉద్రిక్తతు సృష్టించింది. నిలువరించేందుకు ప్రయత్నించిన భారత ఆర్మీతో ఘర్షణకు దిగింది. చైనా ఆర్మీ తన సాంప్రదాయ ఆయుధాలైన స్టీల్‌రాడ్లు, మేకులున్న రాడ్లు, రాళ్లతో దాడి చేసింది. ఈ దాడిలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులయ్యారు. ఫలితంగా ఇండియా, చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం చాలా కాలం తరువాత పలు దఫాలుగా జరిగిన దౌత్య, సైనికాధికారుల చర్చలతో శాంతించింది. ఇప్పటి చైనా తీరు మారనేలేదు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇటు ఇండియన్ ఆర్మీ అదే తరహాలో తిప్పికొడుతోంది.కీ ఈ క్రమంలో చైనాకు బుద్ది చెప్పేందుకు భారత ఆర్మీ మరో అడుగు ముందుకేసింది. చైనాకు(China)దీటైన సమాధానం చెప్పే క్రమంలో ఇండియన్ ఆర్మీ..నాల్ లెథల్ వెపన్స్‌తో(Non Lethal Weapons)రక్షణ ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ ఆర్మీ చైనా తరహాలోనే సాంప్రదాయ ఆయుధాల్ని సమకూర్చుకుంటోంది. త్వరలో భారత ఆర్మీ చేతికి త్రిశూల్, వజ్ర ఆయుధాలు అందనున్నాయి. 


ఆ ఆయుధాల ప్రత్యేకత ఏంటి


వాస్తవానికి 1996, 2005 సంవత్సరాల్లో భారత-చైనా మధ్య ఒప్పందాల్లో భాగంగా రెండు దేశాల సైనికులు కాల్పులు జరపకూడదు. అందుకే దొంగదెబ్బ తీస్తూ ఇనుపరాడ్లు, ఇనుపముళ్ల వంటి ఆయుధాలతో గాల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా దాడులు చేస్తోంది. ఈ దాడుల్ని నిలువరించేందుకు భారత ఆర్మీ కూడా ప్రాణాపాయం లేని వెపన్స్ తయారు చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అపాస్టెరాన్ కంపెనీతో భారత సైన్యం సంప్రదించింది. భద్రతా దళాల సూచనతో శివుడి చేతిలోని త్రిశూలంలా(Trishul)సప్పర్ పంచ్ అనే త్రిశూలం, వజ్ర (Vajra)ఆయుధాలన్ని తయారు చేసినట్టు ఆ కంపెనీ తెలిపింది. ఈ ఆయుధాలతో శత్రు సైనికులపై దాడి చేయడం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల టైర్లను పంక్చర్ చేయడం చేయవచ్చని కంపెనీ ప్రతినిధి తెలిపారు. గ్లౌజ్ తొడుక్కుని దాడి చేస్తే చైనా సైనికులు మూర్ఛపోతారని..త్రిశూల్ టచ్ చేస్తే గిలగిలా కొట్టుకుంటారని అపాస్టెరాన్(Apasteron)కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. చలికాలంలో రక్షణకై గ్లౌజ్‌లా ధరించవచ్చు. కరెంట్ పాస్ చేసి దాడి చేయవచ్చు. 


అయితే కచ్చితంగా ఏ భద్రతా దళాల కోసం ఈ ఆయుధాలు తయారు చేస్తున్నాయనేది స్పష్టత లేదు. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రైవేట్ వ్యక్తులు, సాధారణ ప్రజలకు ఇటువంటి ఆయుధాలు విక్రయించమన్నారు. అటు ప్రభుత్వం తరపు నుంచి గానీ లేదా మిలట్రీ నుంచి గానీ ఈ విషయమై ఎటువంటి ధృవీకరణ ఇంకా అందలేదు. 


Also read: T20 World Cup 2021: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి