Rupee All Time Low: దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో మరింత పతనమైంది. డాలరు మారకంలో రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా డాలరుతో పోలిస్తే 52 పైసల మేర తగ్గి ప్రస్తుతం 77.42 వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం 55 పైసల మేర పతనమైన రూపాయి విలువ సోమవారం (మే 9) మార్కెట్స్ ఆరంభంలోనే మరింత క్షీణించింది. 77.17 వద్ద ప్రారంభమై 77.42కి పడిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు, భారత ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ఆర్బీఐ రెపో రేటును పెంచడం తదితర కారణాలు రూపాయి పతనానికి కారణంగా కనిపిస్తున్నాయి. షాంఘై లాక్‌డౌన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా మార్కెట్లపై గట్టిగానే ప్రభావం చూపాయి.


దేశీయ ఈక్విటీ మార్కెట్ విషయానికొస్తే... 30-షేర్ సెన్సెక్స్ 737 పాయింట్లు పడిపోయింది. అంటే.. 1.34 శాతం మేర క్షీణించి ప్రస్తుతం 54,098.58 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ, నిఫ్టీ 220.25 పాయింట్ల మేర పడిపోయింది. 1.34 శాతం మేర క్షీణించి 16,191.00 పాయింట్లకు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.14 శాతం పెరిగి 112.55 డాలర్లకు చేరుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్‌లో రూ. 5,517.08 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు.


Also Read: MS Dhoni Bat: అందుకే ఎంఎస్ ధోనీ బ్యాట్‌ కొరుకుతాడు.. అసలు విషయం చెప్పేసిన అమిత్‌ మిశ్రా!


Also Read: MLC Kavitha Vs MP Arvind: పసుపుకు ఇళ్లతో తో కౌంటర్.. ఎమ్మెల్సీ కవిత ఇంటిముందు ఆందోళనతో నిజామాబాద్ లో రచ్చ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook