పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రస్థావారాలపై సర్జికల్ స్టయిక్ చేసిన భారత్ పై కసితో రగిలిపోతున్న ఉగ్రవాదులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతీకారం చర్యలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోేని కీలక ప్రాంతాలపై గురిపెట్టినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఇంటెలిజెన్సీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి అప్రమత్తం చేసింది. ఇంటెలిజెన్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఉగ్రమూలు దాడులకు పాల్పడేందుకు మొత్తం 30 కీలక ప్రాంతాలను గుర్తించనట్లు తెలిసింది. 


ఇంటెలిజెన్సీ సమచారంతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ... దేశ రాజధానిలో హై అలర్ట్‌ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లతోపాటు బస్టాండ్‌లలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూకల కోసం డేగ కళ్లతో అన్వేషిస్తున్నారు. ఒక వైపు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో నిమిగ్నమైన భారత ఆర్మీ..ఇప్పుడు దేశ రాజధాని రక్షణ బాధ్యతలు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది