Gas Cylinder Price: ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థ ఇండియన్ ఆయిల్ కొత్త సంవత్సర కానుక ప్రకటించింది. గ్యాస్ వినియోగాదారులకు ఊరటనిట్చే వార్తను అందించింది. గ్యాస్ సిలెండర్ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నూతన సంవత్సర వేళ గ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కంపెనీ శుభవార్త అందించింది. గ్యాస్ సిలెండర్ ధరను భారీగా తగ్గించింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ కాకుండా కమర్షియల్ సిలెండర్‌పై ఏకంగా వంద రూపాయలు తగ్గించింది. ప్రముఖ ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థ ఇండియన్ ఆయిల్ జనవరి 1 నుంచి అంటే ఇవాళ్టి నుంచి కమర్షియల్ సిలెండర్లు అంటే 19 కిలోల సిలెండర్ ధరను వంద రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్ సిలెండర్లుగా ఉన్న 14.2, 5, 10 కిలోల సిలెండర్లపై ఏ విధమైన తగ్గింపు లేదు.


గత ఏడాది అంటే 2021 చివరిలో ఇండియన్ ఆయిల్ (Indian Oil) కంపెనీ కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను సవరించింది. డిసెంబర్ నెలలో 19 కిలోల కమర్షియల్ సిలెండర్ ధలను వంద రూపాయలు అధికంగా వసూలు చేసింది. ఈసారి డొమెస్టిక్ ధరను తగ్గించకపోయినా..పెరుగుదల కూడా లేకపోవడంతో సామాన్యులకు కాస్త ఊరటే. కమర్షియల్ సిలెండర్ ధర తగ్గింపుతో రెస్టారెంట్లు, హోటళ్లు, తినుబండారాలు, టీ స్టాల్ వారికి ప్రయోజనం కలగనుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటనతో వ్యాపారులకు ఉరట కల్గింది. దేశంలోని వివిధ నగరాల్లో కమర్షియల్ సిలెండర్ ధర వంద రూపాయల తగ్గింపు అనంతరం 2 వేల 1 రూపాయిగా ఉంది. గత ఏడాది అక్టోబర్ 19న కమర్షియల్ సిలెండర్ (Comericial Gas Cylinder Rate) ధర 43 రూపాయలు పెరగగా, సెప్టెంబర్ 1న 75కు పెరిగింది.


Also read: Haryana Landslide : మైనింగ్ క్వారీలో ఘోర ప్రమాదం.. శిథిలాల కింద చాలా వాహ‌నాలు, పలువురి మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook