Haryana Landslide : మైనింగ్ క్వారీలో ఘోర ప్రమాదం.. శిథిలాల కింద చాలా వాహ‌నాలు, పలువురి మృతి

Landslide in Haryana’s Bhiwani Mining Quarry : హర్యానాలోని భివానీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దాదామ్ మైనింగ్ జోన్‌లోని క్వారీలో కొండచ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మైనింగ్ నిర్వ‌హించేందుకు ఉన్న వాహ‌నాలు కూడా శిథిలాల కింద‌ కూరుకపోయాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 03:56 PM IST
  • హర్యానాలోని భివానీ జిల్లాలో ఘోర ప్రమాదం
  • దాదామ్ మైనింగ్ జోన్‌లోని క్వారీలో విరిగిపడ్డ కొండచ‌రియ‌లు
  • శిథిలాల కింద కూరుకుపోయిన వాహనాలు, మనుషులు
Haryana Landslide : మైనింగ్ క్వారీలో ఘోర ప్రమాదం.. శిథిలాల కింద చాలా వాహ‌నాలు, పలువురి మృతి

Several Feared Trapped After Landslide in Haryana’s Bhiwani Mining Quarry Buries Dozens of Mining Vehicles : హర్యానాలోని భివానీ జిల్లాలో (Haryana's Bhiwani) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దాదామ్ మైనింగ్ జోన్‌లోని (Dadam mining zone) క్వారీలో కొండచ‌రియ‌లు (landslide) విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మైనింగ్ నిర్వ‌హించేందుకు ఉన్న వాహ‌నాలు కూడా శిథిలాల కింద‌ కూరుకపోయాయి. ఇప్పటి వరకు ఒకరు మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. చాలా మంది ఆచూకీ అసలు లభించలేదు.

అయితే ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ఎంత మంది చనిపోయారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మైనింగ్ నిర్వహించే డ‌జ‌న్ల కొద్దీ వాహ‌నాలు శిథిలాల కింద ఉండిపోయాయి. మైనింగ్ క్వారీలోని (mining quarry) కొండలు అకస్మాత్తుగా కూలిపోయాయి. దీంతో చాలా యంత్రాలు, వాహనాలు అన్నీ శిథిలాల కింద కూరుకుపోయాయి. పదుల సంఖ్యలో క్రేన్స్, డంపర్లు, ఇతర వాహనాలు శిథిలాల కిందే ఉండిపోయాయి.

అయితే ఈ సంఘటన జరిగినప్పుడు మైనింగ్ జరగలేదని ఖానాక్-దాదామ్ క్రషర్ అసోసియేషన్ చైర్మన్ మాస్టర్ సత్బీర్ రాటేరా అన్నారు. క్వారీ చుట్టూ అటవీ ప్రాంతం ఉందని.. క్వారీకి సమీపంలోని కొండ చరియలు అకస్మాత్తుగా విరిగిపడడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.

Also Read : Drunk and drive cases: హైదరాబాద్​లో ఒక్క రోజులోనే వేలల్లో డ్రంక్​ & డ్రైవ్​ కేసులు!

ఘటన స్థలంలో రెస్క్యూ ఆప‌రేష‌న్ (Rescue operation) కొన‌సాగుతోంది. శిథిలాల కింద సుమారు 15 నుంచి 20 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హర్యానా మంత్రి జేపీ దలాల్ ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఘటనపై హర్యానా సీఎం మనోహర్ లాల్ (Chief Minister Manohar Lal Khattar) స్పందించారు. ఇలా జరగడం చాలా దురదృష్టమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Also Read : Ap Cm Ys Jagan: పథకాల్ని అడ్డుకునేవారంతా నిరుపేదల శత్రువులే : వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News