రైల్వే ప్రయాణికులకు షాక్.. అమలులోకి కొత్త రూల్స్.. ఇకపై రైల్లో అలా కుదరదు..
Indian Railway New Rules: రైల్వే శాఖ తాజా నిబంధనలను పశ్చిమ రైల్వేకి చెందిన అధికారి ఒకరు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ నిబంధనల అమలుకు సంబంధించి రెండు వారాల స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టినట్లు తెలిపారు.
Indian Railway New Rules: రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. తాజా నిబంధనల ప్రకారం... ఇకపై రైళ్లలో భారీ సౌండ్‌తో మ్యూజిక్ ప్లే చేయడం, సెల్‌ఫోన్లలో బిగ్గరగా మాట్లాడటంపై నిషేధం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. ప్రయాణికుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు, రాత్రి 10 గంటల తర్వాత.. రైలు కోచ్‌లో నైట్ లైట్ మినహా అన్ని లైట్లు ఆఫ్ చేయాల్సిందే. గ్రూపులుగా ప్రయాణం చేసేవారు అర్ధరాత్రి వరకు ముచ్చట్లు పెడుతూ కూర్చుంటామంటే కుదరదు. లైట్స్ ఆఫ్ చేసిన వెంటనే ఎవరి సీట్లో వారు వాలిపోవాల్సిందే. కొత్త నిబంధనలను ప్రయాణికులు పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించే బాధ్యతను ఆర్పీఎఫ్, టీసీ, కోచ్ అటెండెంట్స్, కేటరింగ్, ఇతర సిబ్బందికి రైల్వే శాఖ అప్పగించింది. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే దానికి వీరిదే బాధ్యత ఉంటుంది. క
రైల్వే శాఖ తాజా నిబంధనలను పశ్చిమ రైల్వేకి చెందిన అధికారి ఒకరు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ నిబంధనల అమలుకు సంబంధించి రెండు వారాల స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టినట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా టీసీ, ఇతర సిబ్బంది కొత్త నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు. మ్యూజిక్ వినేవారు తప్పనిసరిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించాలని ప్రయాణికులకు చెప్పనున్నారు. రైల్వే శాఖ (Indian Railway) తాజా నిబంధనలను నిపుణులు స్వాగతిస్తున్నారు. రైల్ యాత్రి పరిషత్ అధ్యక్షుడు మాట్లాడుతూ... తాజా నిబంధనలతో రైళ్లలో న్యూసెన్స్ తగ్గుతుందన్నారు. ఇదే తరహాలో టికెట్ లేకుండా ప్రయాణించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలు... సంచలన రేపుతోన్న ఆ వ్యక్తి ఆరోపణలు..
Also Read: Horoscope Today January 23 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ కాలం, అప్రమత్తంగా ఉండాలి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook