Railway Recruitment Board Notification Out: ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 32,438 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్‌ డీ లెవల్‌ 1 పొజిషన్‌లో భర్తీలు చేపట్టారు. ముందుగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించిన తర్వాత అభ్యర్థులను ఫిజికల్‌, మెడికల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. సీబీటీ క్వాలిఫై అయితేనే మిగతా వాటికి ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన అర్హత ఇతర వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వే ఉద్యోగం మీ కల, ఎన్నో రోజులుగా రైల్వే జాబ్ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డ్‌ బంపర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్త ఏడాది ముందు నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని  రీతిలో రైల్వే బోర్డు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం పదో తరగతి పాసైతే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాబట్టి ఈసారి మీరు కూడా కాస్త డెడికేషన్‌గా ప్రాక్టీస్‌ చేస్తే రైల్వే జాబ్‌ కొట్టే అవకాశం పుష్కలం. సెంట్రల్ గవర్నమెంట్‌ జాబ్‌కు పొందాలంటే కావాల్సిన అర్హతలు, ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఆర్‌ఆర్‌బీ ఈ నోటిఫికేషన్‌ ద్వారా 32,438 పోస్టులు భర్తీ చేయనున్నారు...
ఆర్‌ఆర్‌బీ పాయింట్స్‌మెన్‌ 5,058
అసిస్టెంట్‌ (ట్రాక్‌ మెషీన్) 799
అసిస్టెంట్‌ (బ్రిడ్జ్) 301
ట్రాక్‌ మెయింటైనర్‌ IV ఇంజినీరింగ్‌ -13,187
అసిస్టెంట్‌ పీవే- 257
అసిస్టెంట్ (సీడబ్ల్యూ)2587
అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌టీ) 2012
అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (డీజిల్‌) 420
అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (ఎలక్ట్రికల్‌) 950
అసిస్టెంట్ ఆపరేషన్స్‌ (ఎలక్ట్రికల్‌) 744
అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏీ-1041
అసిస్టెంట్‌ టీఎల్‌ (వర్క్‌ షాన్‌ ) 624 పోస్టులు
అసిస్టెంట్‌ (వర్క్‌ షాప్‌)-3077 పోస్టులు.


ఇదీ చదవండి:  హైదరాబాద్‌లో OYO బుకింగ్స్‌కు ఫుల్‌ డిమాండ్‌.. ఎక్కువశాతం బుకింగ్స్‌ దానికోసమే చేస్తున్నారట..!  


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పకుండా 10వ తరగతి పాసై ఉండాలి. నేషనల్ అప్రెంటిషిప్‌ సర్టిఫికేట్‌ (NAC) కలిగి ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఏజ్‌ రిలాక్సేషన్‌ కూడా ఉంది.


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జనరల్‌ రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ రూ.250 మిగతావారు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.


ఇదీ చదవండి:  పీవీ సింధు రిసెప్షన్‌ ఫొటోలు.. హైదరాబాద్‌కు అతిరథ మహారథులు..   


స్టేజ్‌ 1 ఎగ్జామ్‌ పూర్తయిన తర్వాత జనరల్‌ రూ.400, ఓబీసీ, ఈడబ్ల్యూస, ఎస్సీ, ఎస్టీ, రూ.250, ఉమెన్‌ రూ.250 రీఫండ్‌ ఇస్తారు. డెబిట్‌ లేదా క్రెడిట్‌, నెట్‌బ్యాంకింగ్‌, యూపీఐలలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.