Indian Railway: భారతీయ రైల్వే సరికొత్త కోచ్‌లను త్వరలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతమైంది. వీటివల్ల తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణం చేయవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ రైల్వే (Indian Railway) ఎప్పటికప్పుడు కొత్త తరహా పధకాలు, కోచ్‌లు ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో కొత్త తరహా కోచ్‌లకు రూపకల్పన చేసింది. తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనున్న థర్డ్‌ ఏసీ ఎకానమీ క్లాస్‌ కోచ్‌లను కపుర్తలా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సిద్ధం చేసింది. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయిందని రైల్వే శాఖ తెలిపింది.


రాజధాని, శతాబ్ది, దురంతో, జన శతాబ్ది, తదితర ప్రత్యేక తరహా రైళ్లు మినహాయించి.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ థర్డ్‌ ఏసీ ఎకానమీ క్లాస్‌ కోచ్( Thirs Ac Economy coach) ‌ను అందుబాటులోకి తెస్తారు. ప్రతి బెర్త్‌కు ఏసీ డక్ట్‌ అమర్చారు. చదివేటపుడు తగిన వెలుతురొచ్చేలా ప్రతి బెర్త్‌ వద్ద లైట్లు ఏర్పాటుచేశారు. బెర్త్‌ వద్ద మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లు అందుబాటులోకి తెచ్చారు. మధ్య, ఎగువ బెర్త్‌లకు చేరుకునేందుకు అనుకూల డిజైన్‌తో నిచ్చెనలు రూపొందించారు. ఈ కోచ్‌ల వల్ల తక్కువ ధరకే ఎసీ రైలు ప్రయాణం చేయవచ్చు. అంటే థర్డ్ ఏసీలోనే ఎకానమీ క్లాస్‌ను చేర్చారు. 


Also read: Supreme court: రిజర్వేషన్లను ఇంకెంత కాలం కొనసాగించాలని ప్రశ్నించిన సుప్రీంకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook