Indian Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై అన్ని సదుపాయాలు అందుబాటులో!
Indian Railways AC Blanket: మీరు తరచుగా రైళ్లలో ప్రయాణిస్తున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే! ఇకపై ఏసీ కోచ్ లలో దుప్పట్లు, పరుపులను ప్రయాణికులను అందించేలా రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు రైళ్లలో జనరల్ బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఇటీవలే ప్రకటించింది.
Indian Railways AC Blanket: తరచుగా రైల్లో ప్రయాణించే వారికి ఇది కచ్చితంగా శుభవార్తే! ఎందుకంటే గత రెండేళ్లుగా దేశంలో కరోనా సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో భారతీయ రైల్వేశాఖ ప్రయాణికుల కోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా ఏసీ బోగీల్లో దుప్పట్లు, పరుపులు ఏర్పాటు చేయడం లేదని గతంలో ప్రకటించింది. అయితే ఇప్పుడు కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గి.. అన్ని కార్యకలాపాలు సాగుతున్నాయి. రైల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. దీంతో గతంలో కరోనా కారణంగా తొలగించిన కొన్ని సదుపాయాలను ఇప్పుడు తిరిగి ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
దూర ప్రయాణాలు చేసే వారికి విశ్రాంతి..
రైళ్లలో ఏసీ బోగీల్లో కరోనా కారణంగా ఇన్ని రోజులు దుప్పట్ల (బ్లాంకెట్స్) ను ప్రయాణికులకు అందజేయలేదు. దీంతో ప్రయాణికులు తమ దుప్పట్లను వారే తెచ్చుకునే వారు. ఈ క్రమంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఇబ్బంది మారింది.
దేశంలో ప్రస్తుతం కరోనా నియంత్రణలో ఉన్న నేపథ్యంలో దుప్పట్లు (బ్లాంకెట్స్), పరుపుల (బెడ్స్) ను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేస్తున్నట్లు ఆ శాఖ స్పష్టం చేసింది.
రైల్వే జోన్స్ జనరల్ మేనేజర్లకు ఆదేశాలు
కోవిడ్ కారణంగా రైళ్లో దుప్పట్లు, పరుపులను ప్రయాణికులకు గత రెండేళ్లుగా అందజేయడం లేదు. ఇప్పుడు కరోనా నియంత్రణలో ఉన్న కారణంగా వాటిని తిరిగి ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రతి జోనల్ మేనేజర్లను రైల్వేశాఖ ఆదేశించింది.
అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లో ప్రయాణం..
మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమానాల సర్వీస్ ను పునరుద్ధరించాలని ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు రైళ్లలో అన్ రిజర్వ్ (జనరల్) కోచ్ లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను కూడా ఆదేశించింది. ఈ నిర్ణయంతో నిత్యం రైళ్లలో ప్రయాణించే లక్షలాది మందికి ఊరట కలిగించినట్లు అయ్యింది.
Also Read: Election Results 2022: ముగిసిన ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. భారతీయ జనతా పార్టీ ప్రభంజనం!
Also Read: CM Yogi Adityanath News: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేషధారణకు ఆ రాష్ట్రంలో విపరీతమైన క్రేజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook