'కరోనా వైరస్'.. భారత దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రమంలో మరిన్ని ఆంక్షలు  అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ రోజు(ఆదివారం) జనతా కర్ఫ్యూ విధించారు. జనతా కర్ఫ్యూను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనతా  కర్ఫ్యూలో భాగంగా రైలు  ప్రయాణాలు కూడా రద్దు చేశారు. రైలు ప్రయాణం చేసే వారిలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3 వేల 700  రైళ్లను రద్దు చేశారు. ఐతే ఇవాళ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ  మరో నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు  మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా  రైళ్ల రాకపోకలను రద్దు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ నిర్ణయం కూడా చరిత్ర పుటల్లో రికార్డులెక్కనుంది.


Read Also: జనతా కర్ఫ్యూ వేళ.. రోడ్లన్నీ నిర్మానుశ్యం..!!   


మార్చి 31  వరకు గూడ్స్ రైళ్లు మినహా ప్రయాణీకుల  రైళ్లన్నీ రద్దు కానున్నాయి.  కొన్ని పట్టణాల్లో సబ్ అర్బన్ సర్వీసులతోపాటు కోల్ కతాలోని  మెట్రో  రైళ్లు ఇవాళ అర్ధరాత్రి వరకు నడవనున్నాయి. ఆ తర్వాత నుంచి వాటిని కూడా మార్చి 31 వరకు బంద్ చేయనున్నారు. 


10 నిముషాల్లోనే ''కరోనా వైరస్'' పరీక్ష..!!


భారత దేశంలో  కరోనా వైరస్ కారణంగా ఇప్పటి  వరకు ఆరుగురు మృతి చెందారు. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఎయిమ్స్ లో  మృతి చెందాడు. ముంబైలో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఇతర అనారోగ్య  సమస్యల  కారణంగా మృతి చెందాడు. మరోవైపు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341కి చేరింది. మొత్తం 16 వేల 999 శాంపిల్స్ తీసుకోగా.. వాటిలో 16 వేల 109 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..