ప్రపంచవ్యాప్తంగా మృత్యుక్రీడ ఆడుతున్న 'కరోనా వైరస్'ను నిర్ధారించడానికి చాలా సమయం పడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆ వెంటే మృతుల సంఖ్య కూడా వేలల్లోకి చేరుకుంటోంది.
కరోనా వైరస్ ను త్వరగా నిర్ధారిస్తే .. చికిత్స చేయడం సులభమవుతుంది. ఐతే దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు భారత దేశంలోనూ కరోనా వైరస్ ను నిర్ధారించే పరిశోధన శాలలు తక్కువగా ఉన్నాయి. ఐతే వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో పరీక్ష కోసం శాంపిల్స్ పంపినప్పటికీ .. నిర్ధారణ పూర్తయ్యే సరికి టైమ్ పడుతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా సంస్థలు..త్వరగా కరోనా వైరస్ ను నిర్ధారించే కిట్లపై దృష్టిసారించాయి. ఇందులో ఇప్పటి వరకు కొన్ని కంపెనీలు సత్ఫలితాలు సాధించాయి. దక్షిణ కొరియాకు చెందిన ఓ పరిశోధనా సంస్థ దీనిలో అందరి కంటే ముందుగా నిలిచింది.
భారత దేశంలో విస్తరిస్తున్న కరోనా..!!
సీజెనే అనే బయోటెక్ కంపెనీ 10 నిముషాల్లోనే కరోనా వైరస్ పరీక్షను నిర్ధారించేలా కిట్ రూపొందించింది. దీనికి అక్కడి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ కిట్ల ద్వారా ఎవరికి వారే సొంతగా పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఉంది. వారానికి 30 వేల కిట్లు ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ఇప్పుడు సన్నాహాలు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే కేవలం 10 నిముషాల్లోనే కరోనా వైరస్ ను నిర్ధారించవచ్చు. పాజిటివ్ గా వచ్చిన వారికి త్వరగా చికిత్స ప్రారంభించవచ్చు. ఫలితంగా మృతుల సంఖ్య తగ్గుతుంది.
Korea finished developing the 10 minute Covid-19 diagnostic kit and is now ramping up production. They plan to export 300.000 test-kits per week - pic.twitter.com/DpJCph9RT7
— Florian Witulski (@vaitor) March 21, 2020
Read Also: జనతా కర్ఫ్యూ వేళ.. రోడ్లన్నీ నిర్మానుశ్యం..!!
ఇటు భారత దేశం గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన కొ-సారా డయాగ్నొస్టిక్ కంపెనీ కూడా కిట్లను తయారు చేస్తోంది. పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ కు కిట్లను పంపించింది. అన్ని అనుమతులు పూర్తి చేసుకుని కిట్ల ఉత్పత్తి ప్రారంభించనుంది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే కిట్లకు వెయ్యి రూపాయల నుంచి 12 వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే భారతీయ కంపెనీలు తయారు చేస్తే కిట్ల ధర ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..