హైదరాబాద్: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా రైలు ప్రయాణం రద్దయిన ప్రయాణికులకు ఊరట కలిగించేలా భారతీయ రైల్వే ఓ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 14 లేదా ఆ తర్వాత రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్లను కొనుగోలు చేసిన ప్రయాణికులకు సంబంధిత టికెట్ రుసుం‌ మొత్తాన్ని పూర్తిగా తిరిగివ్వాలని నిర్ణయించినట్టు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. లఢక్‌లో ఆర్మీ చీఫ్... సైనికులకు పరామర్శ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Indo-China war: ఇండో చైనా వార్‌ జరిగితే.. ఇండియాదే పై చేయి అంటున్న నివేదిక


అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా భారతీయ రైల్వే ఏప్రిల్‌ 15 నుంచి అన్ని సాధారణ రైళ్లలో బుకింగ్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రారంభమైన సందర్భంగా అన్ని రకాల రైలు సర్వీసులను నిలిపివేసింది. ఆయా రైళ్లకు చెందిన రిజర్వేషన్లను కూడా ఈ శాఖ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 నుంచి 120 రోజుల అనంతరం ప్రయాణించేందుకు ఉద్దేశించిన అన్ని టికెట్లకుగాను ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం అత్యవసర ప్రయాణాల నిమిత్తం రైల్వే వివిధ మార్గాల్లో 230 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 
 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..