Railway Recruitment 2024: రైల్వేలో మెగా రిక్రూట్మెంట్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ
Railway Recruitment 2024: నిరుద్యోగులకు, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై ఎదురుచూస్తున్నారికి గుడ్‌న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railway Recruitment 2024: రైల్వే ఉద్యోగాలకై నిరీక్షిస్తుంటే ఇదే మంచి అవకాశం. భారతీయ రైల్వేలో ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఖాళీలు కూడా పెద్దఎత్తున ఉన్నాయి.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకై దరఖాస్తుల్ని ఏప్రిల్ 14 నుంచి స్వీకరిస్తారు. మే 15 వరకూ గడువు ఉంటుంది. ఆర్‌పీఎఫ్‌లో మొత్తం 4660 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. వీటిలో కానిస్టేబుల్ పోస్టులు 4208 కాగా సబ్ ఇన్‌స్పెక్షర్ పోస్టులు 452 ఉన్నాయి. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్దులు ఆన్‌లైన్ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, జీతభత్యాలు వంటి వివరాలు ఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్ rpf.indianrailways.gov.in.ద్వారా తెలుసుకోవచ్చు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఎస్‌ఐ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి డిగ్రీ ఉండాలి. అదే కానిస్టేబుల్ ఉద్యోగాలకైతే పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ కేటగరీ అభ్యర్ధులకు మినహాయింపు ఉంటుంది.
ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష, తరువాత పీఎంటీ, పీఎస్టీ పరీక్షలుంటాయి. ఈ మూడు దశలు దాటితే అప్పుడు సర్టిఫికేట్లు ధృవీకరణ ప్రక్రియ ఉంటుంది. జనరల్, ఓబీసీ కేటగరీ అభ్యర్ధులు అప్లికేషన్ రుసుము 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగరీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు 250 రూపాయలు మాత్రమే రుసుము చెల్లించాలి.
Also read: Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతం పెంపు, వారానికి 5 రోజుల పనిదినాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook