First Rapid Rail: దేశంలో ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లుగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు అంతకంటే వేగంతో ప్రయాణించే రైలును రేపు ప్రదాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ-మీరట్ మధ్య సమయాన్ని గణనీయంగా తగ్గించే రైలు ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో వందేభారత్ రైళ్ల కంటే వేగంగా ప్రయాణించే ఆర్ఆర్‌టీఎస్ ప్రాజెక్టుకు 2019 మార్చ్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ-మీరట్ మధ్య తొలి ర్యాపిడ్ రైలు నడపనున్నారు. మొత్తం 82 కిలోమీటర్లున్న ఢిల్లీ-మీరట్ మధ్య మొదటి దశ 17 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఘజియాబాద్‌లోని షాహిదాబాద్ నుంచి దుహై వరకూ ప్రత్యేక ర్యాపిడ్ రైలు మార్గం పూర్తయింది. ఈ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. 


ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఢిల్లీ నుంచి ఘజియాబాద్ మీదుగా మీరట్ వరకూ నిర్మిస్తున్నారు. మొత్తం 82 కిలోమీటర్ల మార్గంలో 17 కిలోమీటర్లు పూర్తయింది. ఇవాళ లాంఛనంగా ప్రధాని మోదీ స్వయంగా తొలి టికెట్ కొనుగోలు చేసి ఇందులో ప్రయాణిస్తారు. యూపీఐ ద్వారా ప్రధాని మోదీ తొలి టికెట్ కొనుగోలు చేస్తారు. ప్రధాని ప్రయాణ సమయంలో మరో మూడు ర్యాపిడ్ రైళ్లు ఆయనతో కలిసి ప్రయాణిస్తారు. మొదటిది పైలట్ రైలు కాగా రెండవది ప్రయాణీకులది, మూడవది ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగీ ఇతర ప్రజా ప్రతినిధులు ప్రయాణించే రైలు. భద్రతా కారణాల దృష్ట్యా రైలులోని ప్రతి కంపార్ట్‌మెంట్‌లో సీసీ కెమేరాలు, సౌకర్యవంతమైన సిట్టింగ్, ఏర్పాటు చేశారు. ర్యాపిడెక్స్ రైళ్ల నిర్వహణ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ చేస్తుంది. 


ఢిల్లీ మీరట్ మొత్తం మార్గం పూర్తయితే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోనుంది. గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో, సరాసరిన 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఢిల్లీ-మీరట్ మధ్య 82 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం ఉన్న రైళ్లు గంటన్నర నుంచి రెండు గంటల సమయం తీసుకుంటున్నాయి. ర్యాపిడ్ రైలు ద్వారా కేవలం గంటలో ఢిల్లీ నుంచి మీరట్ చేరుకోవచ్చు. ఢిల్లీ మీరట్ తరహా ర్యాపిడ్ రైలు క్యారిడార్లను మరో 8 నిర్మించనుంది. మొదటి దశలో ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిదిలో ఘజియాబాద్-మీరట్, ఢిల్లీ-గుర్గావ్-నిమ్రానా-అల్వార్, డిల్లీ-పానిపట్ ఉన్నాయి.


Also read: Emrs Online Application 2023: 10,391 పోస్టులు.. నేడే లాస్ట్ డేట్.. అప్లై చేశారా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook