RRB JE Recruitment 2024 Notification: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ర్వేల్వే జాబ్ చేయాలనే కల ఉన్న ప్రతి ఒక్కరికి ఇది గుడ్ న్యూస్. 7,911 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల త్వరలో చేయనుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే విధానం, అర్హత ప్రమాణాలు తెలుసుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7,911 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ ఇంజినీర్ (సేఫ్టీ, నాన్ సేఫ్టీ), డిపో మెటిరియల్ సూపరింటెండెంట్ (డీఎంఎస్), కెమికల్, మెటలార్జికల్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఖాళీల వివరాలు..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) జేఈ 7,911 భర్తీ చేయనుంది.
అర్హత..
ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజినీరింగ్ పట్టా పొంది ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా పొంది ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం..
అధికారిక ప్రకటన తర్వాత ఈ పోస్టుల భర్తీని కేవలం ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in లో నోటిఫికేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత హోం పేజీలోని జేఈ రిజిస్ట్రేషన్ 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
మీ వివరాలను అందులో నమోదు చేయాలి.
ఇప్పుడు ఈ కాపీని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి.
ఇదీ చదవండి: ఉత్తర ప్రదేశ్ ఫలితాలపై బీజేపీ అధిష్ఠానం పోస్ట్ మార్టమ్..
ఎంపిక విధానం..
ఈ రిక్రూట్మెంట్ విధానంలో రెండు విధాలుగా ఎంపిక చేస్తారు. ఒకటి కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT1&2) ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎప్పటికప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
ఇదీ చదవండి: బిజెపి జాతీయ అధ్యక్షురాలుగా వసుంధర రాజే..? కమలం పార్టీ వ్యూహం అదేనా.. ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter