అలాంటి వారికి అనుమతి లేదు..!!
దేశవ్యాప్తంగా `కరోనా వైరస్` వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఐనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో పాక్షికంగా రైళ్ల సర్వీసులను పునఃప్రారంభించారు.
దేశవ్యాప్తంగా 'కరోనా వైరస్' వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఐనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో పాక్షికంగా రైళ్ల సర్వీసులను పునఃప్రారంభించారు.
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 37 వేల రైళ్లు ఏకంగా దాదాపు 50 రోజులకు పైగా లూప్ లైన్లకే పరిమితమయ్యాయి. ఐతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైల్వే సర్వీసులు మే 12 నుంచి పునః ప్రారంభమయ్యాయి. పాక్షిక్ష ఆంక్షలతో రైళ్లు మళ్లీ పట్టాలెక్కాయి. ఈ క్రమంలో రైల్వే మంత్రిత్వ శాఖ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.
రైళ్లలో ప్రయాణించే వారి కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. సామాజిక దూరం పాటించాలని సూచించింది. అంతే కాకుండా రైలు ఎక్కే ప్రయాణీకులకు ముందుగానే థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు రైలు ప్రయాణీకులకు మరిన్ని నిబంధనలు అమలులో తీసుకువచ్చింది రైల్వే మంత్రిత్వ శాఖ.
రైళ్లలో ప్రయాణించే వారికి కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వారిని రైలులోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. రైల్వే స్టేషన్ లోనే అందరికీ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారు. ఒకవేళ శారీరక ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి.. కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లయితే .. వారిని రైలులోకి ఎక్కేందుకు అనుమతించరు. ఐతే వారి టికెట్ డబ్బులను పూర్తిగా తిరిగి చెల్లిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒకవేళ గ్రూప్ టికెట్ బుక్ చేసినట్లయితే.. సదరు ప్రయాణీకునితోపాటు మిగతా ప్రయాణీకులు ప్రయాణం చేయడానికి ఇష్టపడకపోతే వారికి టికెట్ డబ్బులను పూర్తిగా చెల్లిస్తామని తెలిపింది. అంతేకాదు ఒకవేళ గ్రూప్ టికెట్ లో కరోనా వైరస్ లక్షణాలు వ్యక్తి కాకుండా మిగతా వారు ప్రయాణించాలనుకుంటే.. వారి PNR నంబర్ అలాగే ఉంచి.. మరో ప్రయాణీకునికి మాత్రం టికెట్ ఛార్జీలను పూర్తిగా చెల్లించనున్నారు.
మరోవైపు ప్రయాణీకులు ఎక్కడికి వెళ్తున్నారో రైల్వేకు చెందిన IRCTC వెబ్ సైట్ రికార్డు చేస్తోంది. ప్రయాణీకులు తప్పనిసరిగా వారి పూర్తి చిరునామాను అందించేందుకు వీలుగా ఓ కాలమ్ పొందుపరిచారు. భవిష్యత్ లో కరోనా విస్తరిస్తే.. వారిని తిరిగి స్క్రీనింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దీన్ని మే 13 నుంచి అమలు చేస్తున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..