Railway Concession: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేనే. రోజూ లక్షలాదిమంది రైలు ప్రయాణం చేస్తుంటారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు రైల్వే వెన్నెముక కూడా. ఎందుకంటే కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తోంది. అదే సమయంలో ప్రయాణీకుల సౌకర్యార్ధం ఎన్నో ఏర్పాట్లు చేస్తుంటోంది. కొంతమందికి రాయితీలు కూడా ఇస్తుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి కంటే ముందు సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లలో రాయితీ లభించేది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ సమయం నుంచి ఈ రాయితీని రైల్వే శాఖ నిలిపివేసింది. అప్పట్నించి తిరిగి పునరుద్ధరించలేదు. దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లు ఈ రాయితీ తిరిగి కొనసాగించాలంటూ కోరుతున్నారు. ఈ నేపధ్యంలో రైల్వే శాఖ కూడా ఇదే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. త్వరలో సీనియర్ సిటిజన్ల రాయితీని పునరుద్ధరించే అవకాశాలున్నాయని రైల్వే శాఖ ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తోందని తెలుస్తోంది. 


కరోనా మహమ్మారి కంటే ముందు సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లలో డిస్కౌంట్ ఉండేది. మహిళా సీనియర్ సిటిజన్లకు 50 శాతం డిస్కౌంట్, పురుషులకు 40 శాతం డిస్కౌంట్ లభించేది. కరోనా సమయంలో ఈ రాయితీలు నిలిపివేశాక సీనియర్ సిటిజన్లు కూడా ఫుల్ ఛార్జ్ చెల్లించి టికెట్ తీసుకుంటున్నారు. రైల్వే శాఖలో మహిళా సీనియర్ సిటిజన్లంటే 58 ఏళ్లు దాటాలి. 


స్లీపర్ తరగతిలో సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ టికెట్ రాయితీ ఇచ్చేది. ఎందుకంటే ఆర్ధికంగా స్థోమత కలిగిన ప్రయాణీకులు స్లీపర్ తరగతిలో ప్రయాణం చేయలేరు. అందుకే ప్రయాణీకుల సౌకర్యార్ధం, అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే టికెట్లలో రాయితీ ఉండేది. అయితే సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లలో రాయితీ కల్పించే అంశంపై రైల్వే నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 


Also read: Tax Saving Tips: మీ భార్యతో కలిసి 7 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా చేసే 3 పద్ధతులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook