Railways Super App: రైలు ప్రయాణీకుల్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వేస్ కొత్త యాప్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో లాంచ్ కానున్న ఈ యాప్‌లోనే ఇకపై టికెట్ బుకింగ్, ట్రైన్ స్టేటస్, రిజర్వేషన్ లభ్యత ఇలా అన్ని వివరాలు లభిస్తాయి. ఇకపై ఒక్కొక్క సేవలకు ఒక్కో యాప్ అవసరముండదు. ఈ యాప్ ఐఆర్సీటీసీతో కనెక్ట్ అయుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద నెట్‌వర్క్. ప్రస్తుతం చాలామంది టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ యాప్ వినియోగిస్తున్నారు. అయితే ఇందులో టికెట్ బుకింగ్ తప్ప చాలా ఆప్షన్లు లేవు. ముఖ్యంగా లైవ్ ట్రైన్ స్టేటస్ అనేది ఐఆర్సీటీసీ యాప్‌లో అందుబాటులో లేదు. ఇతర యాప్స్‌లో కూడా చాలా సేవలు లేవు. అందుకే ఆల్ ఇన్ వన్ యాప్ లాంచ్ చేసేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. వచ్చే నెల డిసెంబర్‌లో రైల్వే శాఖ ఈ కొత్త యాప్ లాంచ్ చేయనుంది. ప్రస్తుతం యూజర్లు టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్, లైవ్ ట్రైన్ స్టేట,స్ వంటివి తెలుసుకునేందుకు ధర్డ్ పార్టీ యాప్స్ వినియోగిస్తున్నారు. కానీ ఇప్పుడు అన్ని సేవలతో ఇండియన్ రైల్వేస్ ఒకే యాప్ లాంచ్ చేయనుంది. 


ఈ కొత్త యాప్ ప్రయాణీకులకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. ఈ కొత్త యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ డిజైన్ చేసింది. ఇది ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌తో లింక్ అయుంటుంది. డిసెంబర్ నెలాఖరులో ఈ కొత్త యాప్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఐఆర్సీటీసీకు, ప్రయాణీకులకు మధ్య ఈ యాప్ ఒక ఇంటర్‌ఫేస్‌లా పనిచేయనుంది. ప్రస్తుతం కొత్త ఆల్ ఇన్ వన్ యాప్ అభివృద్ధి దశలో ఉంది. ఈ యాప్ అందుబాటులో వస్తే ఇక ప్రయాణీకులకు ధర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండకపోవచ్చు. 


ప్రస్తుతం టికెట్ బుకింగ్ కోసం చాలామంది ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ లేదా రైల్ యాత్రి వంటి యాప్స్ ఉపయోగిస్తున్నారు. రైళ్లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్సీటీసీ ఇ కేటరింగ్ ఉపయోగిస్తున్నారు. ఫిర్యాదులు, సూచనల కోసం రైల్ మదద్ యాప్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కొత్త యాప్ అందుబాటులో వస్తే అన్ని సేవలు ఒకే యాప్‌లో లభించనున్నాయి.


Also read: Pensioners Life Certificate: పెన్షనర్లు ఇంట్లోంచి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ఎలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.