Pensioners Life Certificate: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈనెలాఖరులోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ ఆగిపోతుంది. అయితే ఇంట్లో కూర్చునే చాలా సులభంగా లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అదెలాగో తెలుసుకుందాం.
రిటైర్డ్ ఉద్యోగుల కోసం రైల్వే శాఖ కొత్తగా ఓ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా యాప్ నుంచే జీవన్ ప్రమాణ్ పత్ర అంటే లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఇది పెన్షనర్లకు చాలా ఉపయోగపడే వార్త. ఎందుకంటే నవంబర్ 30లోగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ నిలిచిపోతుంది. ఇంట్లో కూర్చునే కావల్సిన జీవన ప్రమాణ్ పత్రను తీసుకోవచ్చు. ప్రస్తుతం రైల్వే రిటైర్డ్ ఉద్యోగులకు ఈ పద్ధతి అద్భుతంగా ఉపయోగపడుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ నడిపిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైనా సరే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి.
దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 3.0 ను 800 నగరాల్లో అందిస్తోంది. రైల్వేకు చెందిన పెన్షనర్లు కెనరా బ్యాంక్, ఎస్బీఐ వంటి బ్యాంకుల ద్వారా పెన్షన్ అందుకుంటుంటారు. అందుకే ఈ రెండు బ్యాంకుల ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ పొందే ప్రక్రియ నడుస్తోంది.
లైఫ్ సర్టిఫికేట్ అందించేందుకు రైల్వే శాఖ యాప్ కూడా ప్రారంభించింది. దీని ద్వారా పెన్షనర్లు ఫేస్ అథెంటిఫికేషన్ ప్రక్రియతో లైఫ్ సర్టిఫికేట్ పొందవచ్చు. స్కానర్ ఓపెన్ కాగానే మీ ముఖాన్ని కెమేరా ముందు పెట్టాలి. అంతే మీ ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ దూరంగా గ్రామాల్లో ఉండేవారికి ఉపయోగకరంగా ఉంది.
Also read: EPF Pension Updates: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈ పద్ధతి పాటిస్తే అదనంగా 8 శాతం పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.