న్యూ ఢిల్లీ: కరోనావైరస్ (COVID-19) దాడి తీవ్రరూపం దాలిస్తే.. ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరిన్ని క్వారంటైన్ సేవలు (Quarantine) అందించేందుకు 20,000 రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దాలని భారతీయ రైల్వే (Indian Railways) నిర్ణయించుకుంది. తద్వారా 3.2 లక్షల మంది కరోనావైరస్ రోగులకు (Coronavirus patients) సేవలు అందించొచ్చని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ మేరకు రక్షణ శాఖకు చెందిన వైద్య సేవల విభాగం, ఇండియన్ రైల్వేలోని పలు జోన్లకు చెందిన మెడికల్ డిపార్ట్‌‌మెంట్స్‌తో పాటు ఆయుష్మాన్ భారత్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలతో ఇండియన్ రైల్వేస్ చర్చలు సైతం జరిపింది. అంతేకాకుండా ఇప్పటికే ఐసోలేషన్, క్వారంటైన్ సేవల కోసం ఐదు రైల్వే జోన్లు రైలు బోగీలపై పనిని సైతం ప్రారంభించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : BCCI: ఐపీఎల్‌పై చిగురిస్తున్న ఆశలు


భారతీయ రైల్వే 5,000 బోగీలను క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చుతుండగా.. వాటిలో మొత్తం 80,000 మంది రోగులకు వైద్య సేవలు అందించేందుకు వీలు కలగనుంది. ఒక్కో బోగీలో 16 బెడ్స్‌ను ఐసోలేషన్ కోసం కేటాయిస్తారు. ఇందుకోసం కేవలం నాన్-ఏసీ ఐసీఎఫ్ కోచ్‌లను మాత్రమే ఉపయోగిస్తున్నట్టు ఇండియన్ రైల్వే స్పష్టంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..