డాలర్ మారకం విలువతో కొద్దిరోజులుగా పతనమవుతూ వస్తున్న రూపాయి మరో చారిత్రక కనిష్టాన్ని తాకింది. ఇవాళ ఒక్కరోజే 42 పైసలు నష్టపోయిన రూపాయి.. ప్రస్తుతం డాలర్‌తో పాలిస్తే రూ.73.33 వద్ద కొనసాగుతోంది. సోమవారం నాటి ముగింపు 72.91వద్ద స్థిరపడ్డ రూపాయి తో పోలిస్తే  42 పైసలు నష్టపోయిన రూపాయి 73.33వద్ద కొనసాగుతోంది. కాగా మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా 73 మార్క్‌ను దాటింది మన రూపాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో రూపాయి విలువ భారీగా పతనమైందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.


మరోవైపు నేటి ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. నేడు రూపాయి రికార్డు స్థాయిలో పతనమవడంతో ఆ ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోంది. బుధవారం సెన్సెక్స్‌ ఆరంభంలోనే 166పాయింట్లు పడిపోయి 36,359 వద్ద ప్రారంభంకాగా, నిఫ్టీ 11వేల పాయింట్ల దిగువన ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఉదయం 9.45 సమయానికి సెన్సెక్స్‌ 255.86 పాయింట్లు పడిపోయి 36270.28 వద్ద ట్రేడవగా.. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 10915.90 పాయింట్ల వద్ద కొనసాగింది. ప్రస్తుతం సెన్సెక్స్ 36,285.05 వద్ద, నిఫ్టీ 10,915.90 వద్ద ట్రేడవుతోంది.


అటు ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంకు, టెక్‌ మహీంద్రా, సిప్లా, గెయిల్‌, కొటక్‌ మహీంద్రా తదితర కంపెనీల షేర్లు లాభాలబాటలో నడుస్తుండగా..  ఐషర్‌ మోటార్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, మారుతి సుజుకి, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తదితర కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి.