India Budget 2022: కేంద్రం ఈసారి కూడా డిజిటల్ బడ్జెట్ నే ప్రవేశపెట్టనుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్‌ కాపీలను (Budget documents) ముద్రించనున్నట్లు సమాచారం. గతంలో బడ్జెట్‌ అంటే పార్లమెంట్‌ సభ్యులకు, జర్నలిస్టులకు అందించడానికి వందలాది బడ్జెట్‌ ప్రతులను ముద్రించాల్సి వచ్చేది. ఈ ముద్రణ కోసం పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌లోని ప్రింటింగ్‌ సిబ్బంది దాదాపు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో బయటి వ్యక్తులెవర్నీ వారు కలిసే వీలుండదు. హల్వా వేడుకతో ఈ క్వారంటైన్‌ ప్రారంభమయ్యేది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోదీ ప్రభుత్వం (Modi Govt) అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ ప్రతుల ముద్రణను తగ్గించింది. పాత్రికేయులు, విశ్లేషకులకు పంపిణీ చేసే కాపీలను తగ్గించింది. గతేడాది కొవిడ్‌ మహమ్మారి కారణంగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు అందించే ప్రతుల సంఖ్యలోనూ కోతపెట్టింది.ప్రస్తుతం ఒమిక్రాన్‌ (Omicron Variant) ఉద్దృతి నేపథ్యంలో హల్వా వేడుక (Halwa ceremony) కూడా నిర్వహించడం లేదు. అయితే, బడ్జెట్‌ డిజిటల్‌ డాక్యుమెంట్ల రూపకల్పన కోసం కొంతమంది సిబ్బంది మాత్రమే క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. 


Also Read: Padma awards 2022: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. బిపిన్ రావత్, కృష్ణ ఎల్లా, నీరజ్ చోప్రా ఎంపిక


పార్లమెంట్‌ సభ్యులు, సాధారణ ప్రజలు బడ్జెట్‌ పత్రాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా యాక్సెస్‌ చేయడానికి ‘'యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌' యాప్‌’ని  ఆర్థిక మంత్రిత్వ శాఖ గతేడాది ప్రారంభించింది. ఆర్థిక మంత్రి  2019లో తన తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంలో బడ్జెట్‌ పత్రాలను ప్రత్యేక బ్రీఫ్‌కేస్‌లో తీసుకెళ్లే దీర్ఘకాల పద్ధతికి స్వస్తి పలికారు. ఆమె తన ప్రసంగాన్ని చదవడానికి హ్యాండ్‌హెల్డ్‌ టాబ్లెట్‌ను ఉపయోగించారు. 2021 ఫిబ్రవరి 1వ తేదీన ఆమె ఎరుపు రంగు వస్త్రంలో చుట్టిన గాడ్జెట్‌ను తీసుకుని పార్లమెంటుకు వచ్చారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook