Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి 75 వేలకు పైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. వేయికిపైగా మరణాలు సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో శనివారం ( ఆగస్టు 29న ) దేశవ్యాప్తంగా కొత్తగా 78,761 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 948 మంది మరణించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ( Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,42,734 కు చేరింది. ఇప్పటివరకు  63,498 మంది ఈ మహమ్మారితో మరణించారు.  Also read: Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,65,302 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 27,13,934 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 10,55,027 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఆగస్టు 29 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,14,61,636 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.   Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు