Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం రికార్డుస్థాయిలో 95,735 కేసులు నమోదు కాగా.. గురువారం వెలుగులోకి వచ్చిన కేసులు, మరణాలు మళ్లీ ఆ రికార్డును బ్రేక్ చేశాయి. గత 24గంటల్లో గురువారం ( సెప్టెంబరు 10న ) దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో.. 96,551 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 1,209 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,62,415కి పెరగగా.. మరణాల సంఖ్య 76,271కి పెరిగింది. Also read: Paresh Rawal: విలక్షణ నటుడికి కీలక పదవి


ప్రస్తుతం దేశంలో 9,43,480 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 35,42,664 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. గురువారం దేశవ్యాప్తంగా 11,63,542 కరోనా టెస్టులు చేశారు. దీంతో సెప్టెంబరు 10 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 5,40,97,975 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. Also read: AstraZeneca Vaccine: ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్