Indias First Covid-19 Patient again infected with Coronavirus: కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో తగ్గుముఖం పడుతోంది. దాదాపు 110 రోజుల కనిష్టానికి కరోనా కేసులు నేడు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న కొందరు వ్యక్తులు మరోసారి కోవిడ్19 బారిన పడుతున్నారు. అందులో కొందరు కోలుకోగా, మరికొందరు చనిపోయిన దాఖలాలున్నాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన తొలి వ్యక్తికి రెండోసారి వైరస్ సోకింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళకు చెందిన యువతి భారత్‌లో తొలి కరోనా వైరస్ బాధితురాలు. గత ఏడాది జనవరి 30న ఆమెకు కరోనా పాజిటివ్ రాగా, కొన్ని రోజుల్లోనే కోలుకుంది. ఆమె మరోసారి కరోనా వైరస్ బారిన పడింది. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు (RT-PCR Tests)లో పాజిటివ్‌గా తేలగా, యాంటీజెన్ కోవిడ్ టెస్టుల్లో నెగటివ్‌గా వచ్చినట్లు కేరళలోని త్రిస్సూర్ జిల్లా డీఎంవో డాక్టర్ కేజే రీనా వెల్లడించారు. చైనా, వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న మెడికల్ స్టూడెంట్ సెమిస్టర్ హాలీడేస్‌లో భాగంగా భారత్‌కు తిరిగిరాగా, ఆమెకు కరోనా వైరస్ (CoronaVirus Positive Cases) పాజిటివ్‌గా గుర్తించడం తెలిసిందే. త్రిస్సూర్ మెడికల్ కాలేజీలో మూడు వారాల చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. తాజాగా ఢిల్లీలో ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లడంలో భాంగా టెస్టులు నిర్వహించగా ఆమె కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. 


Also Read: India Covid-19 Cases: ఇండియాలో భారీగా పెరిగిన కరోనా మరణాలు, ఒక్కరోజులో 2 వేల మంది


ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉందని అధికారులు తెలిపారు. దేశంలో తొలి కరోనా పేషెంట్ కనుక, మరోసారి ఆమెకు వైరస్ సోకడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమెకు రీఇన్‌ఫెక్షన్‌గా భావించాలా వద్దా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సీడీసీ ప్రకారం మూడు నెలల్లో మరోసారి కరోనా సోకితే వారిని రీఇన్‌ఫెక్షన్ (COVID-19 Delta Variant) బాధితులుగా పరిగణిస్తారు. ఐసీఎంఆర్ సూచనల ప్రకారం దాదాపు 100 రోజుల్లో కరోనా మళ్లీ సోకితే వారిని దాన్ని రీఇన్‌ఫెక్షన్‌గా పరిగణిస్తారు. సాధారణంగా అయితే ఒకసారి కరోనా నెగటివ్ వచ్చి కోలుకున్న వారికి, మరోసారి పాజిటివ్‌గా తేలితే దాన్ని రీఇన్‌ఫెక్షన్ అని వ్యవహరిస్తారు. 


Also Read: Covaxin Emergency Use: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO త్వరలోనే అనుమతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook