'కరోనా వైరస్' విలయ తాండవం చేస్తోంది. భారత దేశంలో రోజు రోజుకు రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే భారత దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్ష దాటింది. నిన్న ఒక్కరోజే మరో 5 వేల 611  కొత్త కేసులు  నమోదయ్యాయి. దీంతో  దేశవ్యాప్తంగా  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 6 వేల 750కి చేరుకుంది. అంతే కాదు నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారికి 140 మంది బలయ్యారు. 


దేశవ్యాప్తంగా 61 వేల 149 మంది వివిధ ఆస్పత్రుల్లో  కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో  కలిపి 3 వేల  303 మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు. నిన్న ఒక్క రోజే 5 వేల 611  కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం కావడం విశేషం. 


ఎంఫాన్ ఎఫెక్ట్..!!


మరోవైపు ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత దేశంలో రికవరీ రేటు బాగానే ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 39.62 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 50  లక్షలకు చేరువకు చేరింది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో 3 లక్షల 22 వేల 861 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..