న్యూఢిల్లీ: కరోనావైరస్ (coronavirus) ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. మార్చి 18 తర్వాత అమెరికా, యూరప్, టర్కీ నుంచి భారత్‌కి వచ్చేవారిని దేశంలోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టంచేసింది. విదేశీయులు లేదా విదేశాలకు వెళ్లి వస్తున్న వారితోనే భారత్‌లో కరోనావైరస్ (Coronavirus in India) వ్యాపిస్తున్నట్టు ఇప్పటికే అనేక కేసుల్లో స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనాబారిన పడిన అనేక దేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి తిరిగి రాగా.. రాలేకపోయిన వారిని కేంద్రం ప్రత్యేక విమానాల్లో భారత్‌కి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనావైరస్ లేటెస్ట్ అప్‌డేట్స్ విషయానికొస్తే.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 114కు చేరుకోగా అందులో 17 మంది విదేశీయులు ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) తొలిసారిగా కరోనా కేసు నమోదు కాగా మహారాష్ట్ర (Maharashtra), ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాల్లో తాజాగా మరో ఇద్దరు వ్యక్తులకు కరోనావైరస్ పాజిటివ్ అని గుర్తించారు. కరోనావైరస్‌తో దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలోని కలబుర్గిలో ఒకరు చనిపోగా ఆ తర్వాత ఢిల్లీలో మరొకరు కరోనాకు బలయ్యారు. 


కరోనాను ఎదుర్కొనేందుకు పశ్చిమ బెంగాల్ సర్కార్ తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే కోల్‌కతాలో 200 పడకలతో ఓ ప్రత్యేక క్వారంటైన్ వార్డును సిద్ధం చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..