Indigo Flight Diverted After Bird Hit: గుజరాత్‌లోని సూరత్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. 'ఇండిగో A320 ఎయిర్‌క్రాఫ్ట్ VT-IZI'కి చెందిన సూరత్-ఢిల్లీ ఫ్లైట్ 6E-646 సూరత్‌లో ప్రయాణిస్తుండగా ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ విమానాన్ని అహ్మదాబాద్ వైపు మళ్లించారు. పక్షి ఢీకొట్టిన సమయంలో విమానం 4.7 యూనిట్ల N1 వైబ్రేషన్‌ను ఉత్పత్తి చేసింది. విమానం అహ్మదాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకుముందు శుక్రవారం కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో 'ఫ్లైట్ 6E 2407' విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా భోపాల్‌కు మళ్లించిన విషయం తెలిసిందే. విమాణం గాల్లో ఉన్న సమయంలో ప్రయాణికుడి ఆరోగ్యం బాగా క్షీణించడంతో అతన్ని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఇందుకోసం విమానం భోపాల్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.




ప్రయాణికుడి అనారోగ్యం గురించి సమాచారం అందుకున్న భోపాల్ విమానాశ్రయ బృందం.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎయిర్‌పోర్టులో విమానం కోసం ఎదురుచూపింది. విమానం ల్యాండ్ అవ్వగానే వెంటనే ప్రయాణికుడిని ఆఫ్‌లోడ్ చేసి.. సురక్షితంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించింది.


అదే రోజు కాలికట్ నుంచి దమ్మామ్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ సమయంలో.. దాని తోక భూమిని తాకింది. ఆ తర్వాత ఆ విమానాన్ని తిరువనంతపురం వైపు మళ్లించారు. తిరువనంతపురం విమానాశ్రయంలో పూర్తి ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించి.. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న 168 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


Also Read: TSRTC Bus: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి నో టెన్షన్  


Also Read: Gujarat Earthquake: గుజరాత్‌లో కంపించిన భూకంపం.. భయపెడుతున్న వరుస ఘటనలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook