Minors Inspired By Pushpa : అల్లు అర్జున్ `పుష్ప` చూసి యువకుడిని చంపిన ముగ్గురు మైనర్లు.. వెలుగులోకి సంచలన నిజాలు
Minors Inspired By Gangster Movies Like Pushpa : పుష్ప, భౌకాల్లాంటివి చూసి గ్యాంగ్‌స్టర్స్ లైఫ్‌స్టైల్‌కు అట్రాక్ట్ అయి హత్య చేసిన ముగ్గురు మైన్లర్లు. నేర ప్రపంచంలో తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో హత్య చేశారు.
Three Minors Killed Man: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతంలో ముగ్గురు మైనర్లు ఒక యువకుడిని హత్య చేశారు. ఆ హత్యకు సంబంధించి మొత్తం వీడియో కూడా తీశారు. తర్వాత ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయాలనుకున్నారు.
నేర ప్రపంచంలో తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే కోరికతోనే తాము ఈ దుశ్చర్యకు పాల్పడ్డామన్నారు ఈ ముగ్గురు మైనర్లు. ఢిల్లీ పోలీసులు ఈ ముగ్గురు మైన్లర్లను అరెస్టు చేసి హత్యపై విచారణ చేపట్టగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పుష్ప, (Pushpa) భౌకాల్‌లాంటి మూవీలు వెబ్ సిరీస్‌లు చూశాకా.. తమకు కూడా వాటిలో చేసిన విధంగానే చేయాలనిపించిందని.. వాటిలో గ్యాంగ్‌స్టర్స్ (Gangsters) లైఫ్‌స్టైల్‌కు తాము అట్రాక్ట్ అయ్యామని ఈ ముగ్గురు మైన్లర్లు పోలీసులకు విచారణలో చెప్పారు. చిన్న వయసులోనే హంతకులుగా మారిన ఈ ముగ్గురు మైనర్లు (Three Minors) చెప్పిన విషయాలు విని పోలీసులు కూడా షాక్ అయ్యారు.
కాగా కత్తిపోట్లకు గురైన ఒక వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నట్లు బాబూ జగ్జీవన్‌రామ్ మెమోరియల్ హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించారు. పోలీసు విచారణలో ఆయన ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతానికి చెందిన 24 ఏళ్లు శిబు అని తేలింది.
Also Read : Mood Of The Nation poll: తెలంగాణలో ఎన్నికలొస్తే.. బీజేపీకి ఎన్ని సీట్లోస్తాయంటే..!
అయితే తర్వాత సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా, అన్ని విషయాలు బయటపడ్డాయి. సినిమాల్లోని గ్యాంగ్‌స్టర్స్‌ను చూసి స్ఫూర్తి పొందిన ముగ్గురు ఢిల్లీ కుర్రాళ్లు "బద్నాం గ్యాంగ్" (Badnaam gang) పేరిట ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ ముఠాకు పేరు రావాలంటే ముందు ఒక వ్యక్తిని చంపాలని ప్లాన్ వేసుకున్నారు.
ఆ క్రమంలోనే ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతానికి వెళ్లి ఒంటరిగా దొరికిన శిబుతో గొడవకు దిగారు. ఇక ఇద్దరు అతనిపై దాడి చేయగా.. మూడో కుర్రాడు మొబైల్‌లో అదంతా రికార్డ్ చేశాడు. శిబును కర్రలతో కొట్టి.. చివరకు కత్తితో కడుపులో పొడిచి (Stab) అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read : IT refunds AY22: రూ.1.59 కోట్ల ఐటీ రీఫండ్స్ చెల్లింపు పూర్తి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook