Jagtial Murder Incident: జగిత్యాలలో హత్యల కలకలం.. తండ్రి, ఇద్దరు కుమారులను చంపిన ప్రత్యర్థులు

Jagtial Murder Incident: జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామ నగర్‌లో తండ్రి, ఇద్దరు కుమారులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 02:15 PM IST
  • జగిత్యాల జిల్లాలో హత్యల కలకలం
  • తండ్రి, ఇద్దరు కుమారులను చంపిన ప్రత్యర్థులు
  • తారకరామ నగర్‌లో జరిగిన ఘటన
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Jagtial Murder Incident: జగిత్యాలలో హత్యల కలకలం.. తండ్రి, ఇద్దరు కుమారులను చంపిన ప్రత్యర్థులు

Jagtial Murder Incident: జగిత్యాల జిల్లాలో ఇటీవల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలోని తారకరామ నగర్‌లో ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి, అతని ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ప్రత్యర్థులు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మంత్రాలతో పలువురిని అనారోగ్యానికి గురిచేశారని దాడికి పాల్పడిన వ్యక్తులు ఆరోపించినట్లు సమాచారం. దాడికి ముందు, ఇవాళ తారకారమ నగర్‌లో (జనవరి 20) ఉదయం కుల సంఘ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన తండ్రి, కొడుకులు ఉదయం ఆ సమావేశానికి హాజరైనట్లు సమాచారం.

కాగా, ఐదు రోజుల క్రితం ఇదే జగిత్యాల జిల్లాలో ఇద్దరు టీఆర్ఎస్ నేతల (Jagtial TRS leaders Murder) వరుస హత్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు (Kalvakuntla Vidayasagar Rao) స్వగ్రామం రాఘవపేటలో మామిడి లక్ష్మయ్య (47) అనే టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు  దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి లక్ష్మయ్యను హత్య చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. 

అంతకుముందు రోజు, ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌కి చెందిన టీఆర్ఎస్ నేత రాజేందర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు రాజేందర్‌ను హత్య (Murder Case) చేశారు. 24 గంటల వ్యవధిలోనే జిల్లాకు చెందిన ఇద్దరు టీఆర్ఎస్ నేతలు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. లక్ష్మయ్య, రాజేందర్ హత్యలపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: Covid Antibodies: రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నా తగ్గుతున్న యాంటీ బాడీలు!

Also read: Sabarimala : శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం.. ఆరు జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News