Inter caste marriage controversy: ప్రపంచమంతా అభివృధి బాటలో పయనిస్తోంది. ఎన్నో సవాళ్లు మరెన్నో ఆటంకాలకు దాటుకుని ప్రజలు కూడా ఈ పోటీ ప్రపంచంలో తమను తాము నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆడ, మగ అనే లింగ బేధం లేకుండా ఎంతో మంది అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినప్పటికీ.. మన దేశంలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.


ఇంతకీ ఏం జరిగిందంటే..


కులాలు, మతాలు శాస్వతం కాదు.. మనుషులు, మానవత్వమే శాస్వతం అని ఎందరో మహానుబావులు చెప్పినా కొందరి పంతా మాత్రం మారడం లేదు.  పరువు హత్యలు, కులం పేరుతో దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.


Also read: Sardar Patel birth anniversary: సర్ధార్​ వల్లాబాయ్ పటేల్ 146వ జయంతి నేడు- మోదీ సహా ప్రముఖుల నివాళులు


మధ్య ప్రదేశ్​​కు చెందిన ఓ వ్యక్తి తన కూతురు ఎస్సీ యువకుడిని పెళ్లి చేసుకుందని.. ఏ తండ్రి చేయకూడని పనులు చేశాడు. ఆమెకు బలవంతంగా గుండు గీయించి.. పుణ్య స్నానాలు చేయించాడు. మధ్య ప్రదేశ్​లో జరిగింది ఈ ఘటన.


బేతుల్ జిల్లాలోని చోప్నాకు చెందిన ఓ యువతి స్థానిక హాస్టల్​లో ఉంటూ నర్సింగ్‌ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో నర్సింగ్ చదువుతున్న ఎస్సీ విద్యార్థితో పరిచం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.


ఇద్దరు కులాలు వేరైన కారణంగా ఇంట్లో తమ ప్రేమ విషయం చెప్పేందుకు ధైర్యం చేయలేదు. కులాల వల్ల వేరు కావద్దనే ఉద్దేశంతో చెప్పకుండా పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే.. గత ఏడాది మార్చిలో ఆర్య సమాజ్​లో వివాహం చేసుకున్నారు.


పెళ్లి విషయం కూడా తల్లిదండ్రులకు తెలియకుండా.. స్థానికంగా ఓ అద్దే ఇంట్లో కాపురం పెట్టారు. అయితే ఆ యువతి మాత్రం ఈ ఏడాది ఆరంభంలో పెళ్లి విషయం తండ్రికి చెప్పేసింది. దీనితో ఆ తండ్రి కోపంతో ఊగిపోయాడు. కొన్నాళ్లు మాట్లాడటం మానేశాడు. పోలీసులుకు ఫిర్యాదు చేసి.. తన కూతురు తప్పి పోయిందనే కేసు కూడా పెట్టాడు.


Also read: Rakesh Tikait : ప్రభుత్వ కార్యాలయాలను రైతు మార్కెట్లుగా మారుస్తామంటున్న రాకేశ్ టికాయత్


దీనితో పోలీసులు కలుగు జేసుకుని ఆ యువతికి తల్లిదండ్రులకు నచ్చ జెప్పి వారిని కలిపారు. ఆ సమయంలో యువతి తల్లిదండ్రులు కూడా పెళ్లిని ఒప్పుకున్నట్లు నమ్మిచారు.


కొన్నాళ్ల క్రితం ఆమె తండ్రి యువతిని నర్మదా నది వద్దకు తీసుకెళ్లి బలవంతంగా గుండు గీయించి.. పుణ్య స్నానం చేయించాడు. అయితే ఇదందా బయటపడకుండా.. జాగ్రత్త పడ్డాడు ఆ యువతి తండ్రి. ఎస్సీ యువకుడితో పెళ్లి తనకు ఇష్టం లేదని స్పష్టం చేశాడు. ఆతడికి విడాకులు ఇవ్వాలని కుడా బలవంతం చేశాడు. దీనికి కుటుంబ సభ్యులు తోడయ్యారు. అయితే ఇటీవల ఆ యువతి ఇంటి నుంచి తప్పించుకుని భర్త వద్దకు చేరుకుంది. ఇద్దరు కలిసి పోలిసులను ఆశ్రయించారు.


Also read: Mumbai New Airport: ముంబై సమీపంలో పాల్ఘర్ వద్ద మరో విమానాశ్రయం


దీనితో ఆ యువతి తండ్రి చేసిన దారుణాలన్ని ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Also read: Jugaad Bike Viral: ఇది బైకా? విమానమా? ఒకే సారి పది మంది ప్రయాణిస్తున్నారేంటీ!


Also read: Sanjay Raut On Congress: ‘కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమే!’