Jugaad Bike Viral: ఇది బైకా? విమానమా? ఒకే సారి పది మంది ప్రయాణిస్తున్నారేంటీ!

Wings Moter bike: ఒక బైక్​పై సాధారణంగా ఇద్దరు ప్రయాణిస్తారు. అంతకు మించి అనుమతి కూడా లేదు. అయితే ట్రిపుల్​ రైడింగ్ కూడా మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఎప్పుడైనా ఒకే సారి పది మంది ఒకే బైక్​పై ప్రయాణించడం చూశారా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2021, 05:03 PM IST
  • ఒకే బైక్​పై పది మంది ప్రయాణం
  • విమానంలా బైక్​ను మార్చి ప్రమాదకరంగా ప్రయాణం
  • నెటిజన్ల ఫన్నీ కామెంట్స్​
  • పెట్రోల్, డీజిల్ పెంపునుద్దేశించి ప్రభుత్వంపై విమర్శలు
Jugaad Bike Viral: ఇది బైకా? విమానమా? ఒకే సారి పది మంది ప్రయాణిస్తున్నారేంటీ!

Jugaad Bike viral video: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయి. దీనితో అన్ని నిత్యవసర ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రయాణ ఖర్చులు కూడా భారంగా మారాయి.

ఖర్చులు తగ్గించుకోవడానికి  చాలా మంది ప్రయాణాలకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. మరికొందరేమో కొత్తగా ఆలోచించి.. ప్రయాణ భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే..

తక్కువ ఖర్చులో ఎక్కువ మంది ప్రయాణించేలా ఓ వాహనాన్ని రూపొందించాలనుకున్నాడు ఓ వ్యక్తి. అనుకున్నట్లుగానే ఆ వాహనాన్ని తయారు చేశాడు. దీనితో ఒకే సారి 10 మంది (డ్రైవర్​తో కలిపి) ప్రయాణించేలా దీనిని రూపొందించాడు. విమానం ఆకారంలో దీనిని మలిచాడు వ్యక్తి.

Also read: Viral video: హైవేపై బెడిసికొట్టిన బైకర్ స్టంట్.. చూస్తుండగానే గాల్లోకి ఎగిరి...

అయితే ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ వ్యక్తి కొత్తగా ఈ వాహనాన్ని రూపొందించలేదు. తనతో ఉన్న బైక్​కే రెండు రెక్కల మాదిరిగా చెక్కలు, ఇనుప రాడ్లతో మార్పులు చేశాడు. అందులో ఇరు వైపుల మనుషులు కూర్చునెలా సుపాదాయాలను పొందుపరిచాడు. సాధారణంగా అయితే ఇద్దరు మాత్రమే బైక్​పై ప్రయాణించేందుకు వీలుటుంది. అయితే అతడు తయారు చేసిన బైక్​లో మాత్రం డ్రైవర్​తో కలిగి 10 మంది ప్రయాణించే వీలుంది. 

Also read: Rakesh Tikait : ప్రభుత్వ కార్యాలయాలను రైతు మార్కెట్లుగా మారుస్తామంటున్న రాకేశ్ టికాయత్

Also read: Mumbai New Airport: ముంబై సమీపంలో పాల్ఘర్ వద్ద మరో విమానాశ్రయం

అంతే ఇంకేముంది.  అందులో పెట్టేంత మందిని ఎక్కించుకుని రోడ్డుపై బైక్​ను తోలాడు ఆ వ్యక్తి. అయితే ఆ బైక్​ను ఏమాత్రం కింద పడకుండా నడిపాడా రైడర్​. ఈ బైక్​కు సంబంధించిన ఓ వీడియోను మధ్య ప్రదేశ్ కాంగ్రెస్​ ఎమ్మెల్యే జైవర్ధన్​ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఈప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోకు.. 'పెట్రోల్​, డీజిల్​ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో ఈ వ్యక్తి జుగాడ్ విమానాన్ని తయారు చేశాడు' అని క్యప్షన్ పెట్టారు జైవర్ధన్​.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వాహనాలనం భలే ఉందే అంటు కొందరంటే.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు.. మాత్రం చూసేందుకు ఇది బాగానే ఉన్నా ఇలా ప్రయాణం చేయడం ప్రాణాలకే ప్రమాదం అని అంటున్నారు. ముఖ్యంగా బైక్​పై ఎక్కిన వారిలో ఎక్కువ మంది మహిళలే కావడం గమనార్హం.

Also read: Lanino Effect: ఈసారి ఉత్తరాది వణికిపోనుందా, భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Also read: Rahul Gandhi Bike taxi ride: గోవాలో రాహుల్​ గాంధీ బైక్​ ట్యాక్సీ జర్నీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News