పీఎఫ్ ఖాతాదారులకు వచ్చే వడ్డీ.. ఇక 8.55 శాతం మాత్రమే..!
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌ఓ)లో ఉద్యోగస్తుల తరఫున ప్రతి నెల కంపెనీలు జమచేసే పీఎఫ్ మొత్తంపై 2017-2018 సంవత్సరానికి గాను 8.55 శాతం మాత్రమే వడ్డీని చెల్లించాలనే ఆలోచనకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌ఓ)లో ఉద్యోగస్తుల తరఫున ప్రతి నెల కంపెనీలు జమచేసే పీఎఫ్ మొత్తంపై 2017-2018 సంవత్సరానికి గాను 8.55 శాతం మాత్రమే వడ్డీని చెల్లించాలనే ఆలోచనకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ట్రస్టీలు ఈ వడ్డీ రేటును నిర్ణయించాయి.
రెండు నెలల క్రితం కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి సంతోష్ గంగ్వార్‌తో జరిగిన సమావేశంలో ట్రస్టీలు 8.55 శాతం వడ్డీ రేటు గురించి తొలిసారిగా మాట్లాడారు. గత నాలుగేళ్ల నుండి 8.65 నుంచి 8.8 శాతం వరకు వడ్డీ చెల్లించిన ఈపీఎఫ్‌వో ఈ సారి అంత కంటే తక్కువ చెల్లించడానికి ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం. అయితే సేవింగ్స్‌కు సంబంధించి ఇతర ప్రభుత్వ స్కీములపై ఇస్తున్న వడ్డీ కంటే ఈ వడ్డీ కాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతేడాది ఇవే స్కీముల మీద వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా అందుకు మినహాయింపు కాదు.