BJP Raghunandan Rao: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే
Dubbaka BJP Candiadate Raghunandan Rao Madhavaneni | దుబ్బాక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘనందన్ రావు ( Raghunandam Rao ) మాధవనేని గురించి ఆసక్తికరమైన విషయాలు, చదువు, రాజకీయం వంటి విషయాలు మీకోసం.
BJP Candidate Raghunandan Rao | ఇటీవలే దుబ్బాక ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన రఘునందన్ రావు రాజకీయ ప్రస్తానం మొదలైంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి నుంచి. తరువాత ఆయన బీజేపీకి మారారు. ఇలా దుబ్బాక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘనందన్ రావు ( Raghunandam Rao ) మాధవనేని గురించి ఆసక్తికరమైన విషయాలు, చదువు, రాజకీయం వంటి విషయాలు మీకోసం. రఘునందన్ రావు మార్చి 23,1968లో సిద్ధిపేటలో జన్మించారు. అక్కడే పెరగిన ఆయన 1991లో సిద్ధిపేటకు తన నివాసాన్ని మార్చారు.
Also Read | Grama Sachivalayam Dress Code: గ్రామ సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్
విద్యాభ్యాసం..
రఘునందన్ రావు బ్యాచిల్ ఆఫ్ సైన్సెస్, LLB, BEd, హ్యూమన్ రైట్స్ తో పీజీ డిప్లమా పూర్తి చేశారు.
కెరియర్
1991లో పటాన్ చెరు ప్రాంతానికి నివాసం మార్చారు. అనంతరం ఒక తెలుగు దినపత్రికలో సుమారు 5 సంవత్సరాల పాటు న్యూస్ కంట్రిబ్యూటర్ గా పని చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్య ఆప్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు.
Also Read | IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?
ప్రముఖ కేసు..
2013లో పార్లమెంట్ సభ్యుడు అయిన అసదుద్దిన్ ఓవైసీ పిటీషన్ కేసును తీసుకున్నందుకు రఘునందన్ రావు పేరు మారుమోగిపోయింది.
Also Read | Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి
రాజకీయ ప్రస్థానం
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ( TRS ) చేరిన రఘునందన్ రావు. అయితే తెలుగు దేశం పార్టీ ( TDP ) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడుతో సమావేశం అయినందుకుగాను అయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో భారతీయ జనతా పార్టీలో చేరారు. దుబ్బాక నియోకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఆస్తులు, అప్పులు
2018లో ఎన్నికల సమయంలో వెల్లడించిన సమాచారం ప్రకారం రఘునందన్ రావు మాధవనేని వద్ద ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.15,93,52,345 కాగా, అప్పుల విలువ రూ. 80,00,000
Also Read | 10 Lakh Dollar: దుబాయి లాటరీలో భారత సంతతి వ్యక్తికి కాసుల పంట
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR