Village Secretariat Employees Dress Code | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రజా సేవల్లో మంచి అభ్యున్నతి చూపిస్తోన్న గ్రామ సచివాలయానికి ( Grama Sachivalayam) ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విధంగా, ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బందకి యూనిఫర్మ్ ఇవ్వాలని నిర్ణయించింది జగన్ ( CM Jagan) ప్రభుత్వం.
Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!
గ్రామ సచివాలయ సిబ్బంది స్థానికులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ప్రజలు వారిని సులువుగా గుర్తుపట్టేందుకు ఈ డ్రెస్ కోడ్ ఉపయోగపడుతుంది అని ప్రభుత్వం ( AP ) భావిస్తోంది. పైలేట్ ప్రాజెక్టుగా కొంత మంది సిబ్బందికి యూనిఫార్మ్ వేసుకోమని కూడా తెలిపింది. కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ మేరకే డ్రెస్ కోడ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్కడ వచ్చిన స్పందనను బట్టి అన్ని సచివాలయాల్లో వీటిని అమలు చేసే అవకాశం కూడా ఉంది. ఇందులో ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కూడా గమనిస్తారు అధికారులు.
Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి!
ముందుగా ప్రకాశం జిల్లాల్లో గ్రామ సచివాలయ సబ్బందికి యూనిఫార్మ్ అందించనున్నారు. ప్రకాశం జిల్లాలో మొత్తం179 నగర వార్డు సెక్రటేరియల్లు ఉండగా, గ్రామాల్లో 884 గ్రామ సెక్రటేరియట్లు ఉన్నాయి. మొత్తం 8535 మంది సిబ్బంది ఉన్నారు. వేలాదిగా ఉండే గ్రామ సిబ్బందికి ఒక ప్రత్యక డ్రెస్ కోడ్ ఇవ్వాలి ప్రభుత్వం భావిస్తోంది.
Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే
స్కైబ్లూ కలర్ షరల్లు, బిస్కెట్ కలర్ ప్యాంట్స్ ను పురుష గ్రామ సచివాలయ సిబ్బందికి ఇవ్వనున్నారు. అదే సమయంలో మహిళలుకు స్కై బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగ్గింగ్స్ అందించనున్నారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR