International Yoga Day 2021: యోగా కోసం mYoga App ప్రారంభించిన ప్రధాని మోదీ, కోవిడ్19పై పోరాటానికి యోగానే సాధనం
PM Narendra Modi launches mYoga App: నేడు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా mYoga appను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
PM Narendra Modi launches mYoga App: ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన దేశం మనది. పురాతన కాలం నుంచే అందుబాటులో ఉన్న యోగా విద్యను నేడు మరోసారి ప్రపంచ దేశాలు ఆచరించడం ఎంతో సంతోషదాయకం. నేడు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు..
నేడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా mYoga appను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ మొబైల్ యోగా యాప్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. యోగా ట్రైనింగ్ వీడియోలను ప్రపంచ దేశాలు వీక్షించవచ్చు. యోగాసనాలు వేసే విధానం, ఏ యోగాసనాలు వేయాలి, వాటి వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలుసుకునే అవకాశం ఉంది. వన్ వరల్డ్ వన్ హెల్త్ అనే నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ యోగా యాప్‌ను లాంచ్ చేశారు.
Also Read: Foods To Eat During Covid-19: కరోనా నుంచి త్వరగా కోలుకునేందుకు ఈ ఆహారం తీసుకోండి
కరోనా మహమ్మారితో పోరాడుతున్న తరుణంలో యోగానే మీ ఆరోగ్యాన్ని సంరక్షించే ఓ సాధనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా భారత్‌లో ఇందుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదన్నారు. ఎన్నో సమస్యల నుంచి ఎలా బయటపడాలో యోగా ప్రపంచానికి నేర్పుతుందన్నారు. విశ్వంలో అత్యంత శక్తిని ప్రసాదించే సాధనం యోగా అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. క్షేమం కోరకు యోగా (Yoga For Wellness) అనేది ఈ ఏడాది థీమ్. నేడు దేశవ్యాప్తంగా 75 కేంద్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) నిర్వహిస్తున్నారు.
Also Read: Delta Plus Variant of COVID-19: డెల్టా ప్లస్ వేరియంట్ నిజమే, B.1.617.2.1పై స్పందించిన కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook