Invisible Forces: అదృశ్య శక్తులు నా ఆభరణాల బరువు తగ్గిస్తున్నాయి-పోలీసులకు మహిళ ఫిర్యాదు
Madhya Pradesh woman complaints over invisible forces: మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ అదృశ్య శక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ శక్తులు తన ఆహారం, దుస్తులు, డబ్బు దొంగిలిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. అవి తన బంగారు ఆభరణాల బరువు తగ్గిస్తున్నాయని చెప్పారు. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు షాక్ తిన్నారు.
Madhya Pradesh woman complaints over invisible forces: ఓవైపు ప్రపంచం అధునాతన సాంకేతికత, ఆవిష్కరణలతో ముందుకు దూసుకెళ్తుంటే... మరోవైపు సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు మనుషులను వెనక్కి నడిపిస్తున్నాయి. ఉన్నత విద్యావంతులు సైతం మూఢ నమ్మకాల వలలో చిక్కుకోవడం ఆలోచించాల్సిన విషయం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) బేతుల్ జిల్లాకు చెందిన ఓ మహిళా సబ్ ఇంజనీర్... కనిపించని అదృశ్య శక్తులు తనను వెంటాడుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ అదృశ్య శక్తులు (Invisible forces) తన ఆహారం, దుస్తులు, డబ్బులను దొంగిలిస్తున్నాయని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు, అవి తన బంగారు ఆభరణాల బరువును తగ్గిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. నాలుగైదు రోజులుగా తనకీ సమస్య ఎదురవుతోందని... వెంటనే దీన్ని పరిష్కరించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతోనూ ఆమె ఇదే విషయాన్ని వెల్లడించారు.
మహిళలకు బంగారంపై మక్కువ ఉండటం సహజమే గానీ... అదృశ్య శక్తులు తన ఆభరణాల బరువు తగ్గిస్తున్నాయని ఆ మహిళ చెప్పడం చాలామందిని విస్తుపోయేలా చేస్తోంది. ఆ మహిళ ఫిర్యాదుపై (Madhya Pradesh Incident) కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రత్నాకర్ హింగ్వే స్పందించారు. ప్రధానమంత్రి రూరల్ రోడ్ మిషన్‌లో ఆ మహిళా సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అదృశ్య శక్తులంటూ ఏవీ లేవని... ఆమె ఓ భ్రాంతిలో ఉన్నట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ కోసం ఆమెను సైక్రియాటిస్ట్ వద్దకు పంపించనున్నట్లు తెలిపారు. అదృశ్య శక్తులు బంగారం బరువు తగ్గిస్తున్నాయనే వాదనను ఆయన కొట్టిపారేశారు. సాధారణంగా రోజులు గడిచేకొద్ది బంగారం కొన్ని మిల్లీగ్రాములు తగ్గడం సహజమేనని చెప్పారు. సబ్ ఇంజనీర్ హోదాలో పనిచేసే మహిళ.. ఇలా అదృశ్య శక్తులపై ఫిర్యాదు చేయడమేంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
Also Read: Telangana:నేడు బీజేపీ గూటికి తెలంగాణ ఉద్యమ నేత విఠల్-రేపు తీన్మార్ మల్లన్న?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook