IRCTC guidelines: కరోనా మహమ్మారి మహమ్మారికి.. రెండేళ్లు దాటి మూడో సంవంత్సరం కూడా ప్రారంభమైంది. రక రకాల వేరియంట్ల రూపంలో ఈ మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. ఒమిక్రాన్​ వేరియంట్​ రూపంలో ఇప్పుడు ఆందోళనలు కలిగిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మూడో దశలో భారీగా కేసులు నమోదై.. ఇప్పుడు మళ్లీ సాధారణ స్థితికి చేరుతున్నా.. కొవిడ్ ముప్పు పూర్తిగా తొలిగిపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఆర్​సీటీసీ.. రైల్వే ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. ప్రయాణికులు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను ప్రకటిచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


రైల్వే ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలు..


1) టికెట్ కన్ఫార్మ్ అయితేనే ప్రయాణానికి సిద్ధం కావాలి


2) ఫేస్​మాస్క్​, హ్యాండ్ శానిటైజర్​ తప్పనిసరి


3) ప్రయాణ సమయానికి కనీసం 90 నిమిషాల ముందే స్టేషన్​కు చేరుకోవాలి. (కరోనా నిబంధనల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు)


4) రైల్వే స్టేషన్​లో, రైళ్లలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరి


5) స్టేషన్​లో ఉన్నప్పుడు నిర్దేశించిన అన్ని రకాల భద్రత నిబంధనలు పాటించాలి.


6) ఎక్కువ దూరం ప్రయాణాలు చేసే రైళ్లలో షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి. లోకల్ ట్రైన్లలో మాత్రం 50 శాతం కెపాసిటీతోనే సేవలందిస్తాయి.


7) కొన్ని రాష్ట్రాలు నెగెటివ్ రిపోర్ట్​ ఉంటేనే ప్యాసింజర్లను తమ రాష్ట్రంలోకి అనుమతినిస్తున్నాయి. మీరు వెళ్లే ప్రాంతంలో కొవిడ్ నిబంధనల గురించి ముందే తెలుసుకుని సిద్ధంగా ఉండటం మంచిది.


కరోనా టీకా తీసుకుంటే?


1) కరోనా టీకా తీసుకుంటే.. కరోనా సోకే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అయితే వ్యాక్సిన్ 100 శాతం కొవిడ్ సోకకుండా అడ్డుకోలేదని నిర్ధారించుకోవాలి. అయితే రిస్క్​ స్థాయిని తగ్గించేందుకు టీకా వేసుకోవడం తప్పనిసరి.


2) టీకా తీసుకున్నప్పటికీ.. ప్రయాణ సమయంలో ప్రామాణిక జాగ్రత్తలను పాటించాలి.


3) భౌతిక దూరం పాటించేందుకు వీలుకాని సమయంలో మాస్క్​ కచ్చితంగా వాడాలి. వీలైనంత త్వరగా జన సమూహం నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.


4) ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య మీటర్ భౌతిక దూరం ఉండేలా చూసుకోవడం ఉత్తమం


5) ప్రయాణ సమయంలో అనవస వస్తువులను ముట్టుకోకూడదు. ఎక్కడైన ముట్టుకున్నట్లైతే చేతులను వెంటనే హ్యాండ్ శానిటైజర్​తో శుభ్రం చేసుకోవాలి.


6) అపరిశుభ్రమైన చేతులతో కళ్లు, ముక్కు, నోటిను ముట్టుకోవద్దు. ఆహార పదార్థాల తినొద్దు.


Also read: Young Woman Raped: కదులుతున్న ట్రైన్​లో యువతి అత్యాచారం- సీటు ఇస్తానని నమ్మించి..!


Also read: Hijab Row: ఇది మా అంతర్గత వ్యవహారం.. హిజాబ్ వివాదంపై పాక్‌, అమెరికాకు భారత్ కౌంటర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook