Hijab Row: ఇది మా అంతర్గత వ్యవహారం.. హిజాబ్ వివాదంపై పాక్‌, అమెరికాకు భారత్ కౌంటర్

Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ వివాదంపై పాక్, అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. ఇది మా అంతర్గత వ్యవహారమని.. ఇందులో తలదూర్చవద్దని హెచ్చరించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 04:21 PM IST
  • హిజాబ్ వివాదంపై పాక్, అమెరికాకు భారత్ కౌంటర్
  • ఇది మా అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పిన భారత్
  • ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని హెచ్చరిక
Hijab Row: ఇది మా అంతర్గత వ్యవహారం.. హిజాబ్ వివాదంపై పాక్‌, అమెరికాకు భారత్ కౌంటర్

Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ఇతర దేశాల జోక్యాన్ని భారత్ తప్పు పట్టింది. భారత అంతర్గత వ్యవహారంలో ఇతర దేశాల ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోందని.. రాజ్యాంగ నియామవళి, యంత్రాంగం, ప్రజాస్వామికతకు అనుగుణంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేశారు. కర్ణాటక విద్యా సంస్థల్లో నెలకొన్న డ్రెస్ కోడ్ వివాదంపై పలు దేశాల వ్యాఖ్యలకు ఇది భారత్ ప్రతిస్పందన అని తెలియజేశారు.

కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ఇటీవల అమెరికా, పాక్ స్పందించిన సంగతి తెలిసిందే. హిజాబ్‌పై ఆంక్షలు ముస్లిం యువతుల హక్కులను కాలరాయడమేనని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముస్లింలను అణచివేయడమేనని..  వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. అటు అమెరికా కూడా హిజాబ్‌ వివాదంపై పాక్ తరహా వ్యాఖ్యలే చేసింది. మతపరమైన దుస్తులపై నిషేధం విధించడం మతస్వేచ్చను హరించడమేనని ఆరోపించింది. హిజాబ్ వివాదంపై అమెరికా, పాక్ వ్యాఖ్యలతో భారత్ తాజాగా కౌంటర్ ఇవ్వక తప్పలేదు. 

కాగా, ముస్లిం యువతులు హిజాబ్ ధరించి స్కూళ్లు, కాలేజీలకు రావడాన్ని నిరసిస్తూ కర్ణాటకలో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. హిజాబ్‌కు నిరసనగా కాషాయ కండువాలతో కొంతమంది విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ వివాదం చిలికి చిలికి గాలి వాన కావడంతో విద్యా సంస్థలను మూడు రోజుల పాటు మూసివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ ముగిసి తుది తీర్పు వచ్చేంతవరకూ విద్యా సంస్థల్లో మతపరమైన దుస్తులకు అనుమతి లేదని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అత్యవసర విచారణకు పిటిషన్లు దాఖలవగా.. న్యాయస్థానం వాటిని తోసిపుచ్చింది. సరైన సమయంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. 

Also Read: Viral Video: చీర కోసం ఇంత రిస్కా తల్లి.. కొడుకు ప్రాణాలు పోయేవిగా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News