Indian Railways Latest News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఆ సేవలు ప్రారంభం
Indian Railways Latest News: కొవిడ్ కారణంగా రైలు ప్రయాణాలపై భారీ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో.. గతంలో నిలిపివేసిన సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Railways Latest News: రైళ్లలో దూరపు ప్రయాణాలు చేసే వారికి గుడ్ న్యూస్. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత నిలిపివేసిన సర్వీసులు ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభిస్తోంది ఇండియన్ రైల్వేస్. ముఖ్యంగా ఏసీ కోచ్లలోప్రయాణించే వారికి కల్పించే సౌకర్యాలను తిరిగి ప్రారంభించనున్నట్లు తాజాగా ప్రకటించింది. పలు ట్రైన్లలో ఇప్పటికే ఆయా సేవలు ప్రారంభమయ్యాయి. ఇదే నెలలో ఇతర రైళ్లకు కూడా వర్తించేలా కృషి చేస్తున్నట్లు తెలిపింది.
ఇంతకీ తిరిగి ప్రారంభమవనున్న సేవలు ఏవి?
రైళ్లలో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి.. బెడ్ రోల్, దిండు, దుప్పటి వంటివి సమకూర్చాలని నిర్ణయించింది భారతీయ ఐఆర్సీటీసీ. దేశంలో కొవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీటన్నింటిని సీల్డ్ కవర్లో అందించాలని కూడా నిర్ణయించింది ఐఆర్సీటీసీ.
ఈ సేవలు ఎందుకు నిలిపివేశారు?
కరోనా మొదటి దశలో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి దశ లాక్డౌన్ రైల్వే సేవలు తిరిగి ప్రారంభించగా.. ఏసీ కోచ్‌లలో దిండు, బెడ్డు, దుప్పటి వంటివి సమకూర్చడం నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్ నిబంధనలల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ప్రయాణికులు తమ సొంత దుప్పట్లను తెచ్చుకునేందుకు మాత్రం అనుమతినిచ్చింది.
అయితే ప్యాసింజర్లకు అందించే సేవలు పునరుద్ధరిస్తున్నప్పటికీ.. ఏసీ కోచ్‌లలో ఉష్టోగ్రతను 24-25 మధ్యే ఉంచాలని నిర్ణయించింది భారతీయ రైల్వే విభాగం. ఇప్పటికే ఉత్తర రైల్వే పరిధిలోని 92 రైళ్లలో ఈ సేవలు పునరుద్ధరించినట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. అందులో నేడే 26 ట్రైన్లలో ఈ సేవలు ప్రారంభించినట్లు వివరిచింది. త్వరలోనే మరో 23 రైళ్లలో ఈ సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
Also read: Coronavirus XE Variant: భారత్‌లో కొత్త వేరియంట్ కలకలం.. ముంబైలో తొలి కేసు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook