IRCTC update: మహిళల రక్షణకు రైల్వే కీలక నిర్ణయం- ఆ ట్రైన్లలో బెర్త్‌లు రిజర్వ్!
Indian Railways: భారతీయ రైల్వే మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రయాణాలు చేసే రైళ్లలో మహిళలకోసం బెర్త్‌లు రిజర్వ్ చేయనున్నట్లు తెలిపింది.
Indian Railways: భారతీయ రైల్వే సేవలను మహిళలకోసం మరింత సురక్షితంగా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దూరప్రయాణాలు చేసే రైళ్లలో మహిళలకోసం బెర్త్‌లు రిజర్వ్ (Reserved berths for women) చేయనున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది.
ఈ నిర్ణయం మహిళలు సురక్షితంగా (Women safety) ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ విషయంపై మాట్లాడిన అశ్విని వైష్ణవ్.. రైళ్లలో దూరప్రయాణం చేసే మహిళల సౌకర్యార్థం ప్రత్యేక బెర్త్‌లతోపాటు.. సౌకర్యవంతమైన సదుపాయాలెన్నో కల్పించనున్నట్లు వెల్లడించారు.
అశ్విని వైష్ణవ్ చెప్పిన వివరాల ప్రకారం..గరీబ్ రథ్, రాజధాని, దురంతో, ఏసీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లలోని స్లీపర్కాల్స్లో ఆరు బెర్త్‌లు మహిళలకోసం రిజర్వ్ చేసి ఉంటాయి. వయసు బేధం లేకుడా మహిళలంతా ఈ బెర్త్‌లను వినియోగించుకోవచ్చని వివరించారు.
ఇదే కాకుండా.. మహిళలు ఓ గ్రూప్‌గా ప్రయాణిస్తున్నట్లయితే.. స్లీపర్ కోచ్‌లో వారందరికి కూడా కలిపి ఒకేసారి బెర్త్‌లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది రైల్వే శాఖ. ప్రతి స్లీపర్ కోచ్‌లో కిందివైపు ఉండే 6-7 బెర్త్‌లు మహిళలకోసం రిజర్వ్ చేసి ఉంటాయని వివరించింది. 3ఏసీ కోచ్‌లో 4-5 లోవర్ బెర్త్‌లు రిజర్వ్ చేసి ఉంటాయని పేర్కొంది. ఇక 2ఏసీలో 3-4 బెర్త్‌లు రిజర్వ్ కోసం కేటాయించనున్నట్లు వివరించారు.
మహిళ భద్రత కోసం..
మహిళా ప్రయాణికుల భద్రరత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), జిల్లాల పోలీసు శాఖలకు ప్రత్యేక సూచనలు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Also read: Heart Breaking: మైనర్ బాలిక హార్ట్ బ్రేకింగ్ సూసైడ్ నోట్-లైంగిక వేధింపులతో ఆత్మహత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook