చెప్పేది ఒకటి..చేసేది మరొకటి. అందుకే చైనాను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదంటారు. ఓ వైపు భారత- చైనా రక్షణ శాఖ మంత్రుల ( India chine defence ministers high level meet ) ఉన్నత స్థాయి భేటీ జరుగుతుండగానే...మరోసారి చైనా దుండగ చర్యకు పాల్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


లడాఖ్ ( ladakh ) లోని గల్వాన్ లోయ ( Galwan valley ) లో మే నెలలో ఇండియా చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపద్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల్ని పరిష్కరించడానికి ఓ వైపు రెండు దేశాల మద్య చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైనికాధికారుల మధ్యనే సాగిన చర్చలు ఇప్పుడు మరో కీలక ఘట్టానికి చేరుకున్నాయి. మాస్కోలో రెండు దేశాల రక్షణ శాఖ మంత్రులు కీలకమైన అత్యున్నత స్థాయి సమావేశం జరుపుతున్నారు. అయినా సరే చైనా మాత్రం తన కవ్వింపు చర్యల్ని గానీ..దుండగ చేష్టల్ని మాత్రం మానడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఐదుగురు స్థానికుల్ని చైనా బలగాలు కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ( China liberation army )..అరుణాచల్ ప్రదేశ్ ( Arunachal pradesh ) కు చెందిన ఐదుగురిని అపహరించిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ ( Congress mla ninong ering ) ఆరోపించారు. రాష్ట్రంలోని సుబానాసిరి జిల్లాకు చెందిన 5మంది స్థానికుల్ని కిడ్నాప్ చేసిందని ఆరోపిస్తూ..ఏకంగా ప్రదాని మోదీ కార్యాలయానికి ట్వీట్ చేశారు.



గతంలో కూడా చైనా ఇలాంటి చాలా చర్యలకు పాల్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ ఆరోపించారు. అటు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో చర్చల్లో మాత్రం భారతదేశమే కవ్వింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఎదురు ఆరోపణలు చేయడం గమనార్హం.  Also read: Indo-China Dispute: మాస్కో వేదికగా రాజకీయ అత్యన్నత స్థాయి భేటీ