భారత రక్షణా కేంద్రంలో ఐఎస్ఐ ఏజెంట్; వల వేసి పట్టుకున్న యాన్టీ టెర్రరిస్ట్ స్క్వాడ్
మహారాష్ట్ర: నాగ్ పూర్ లో పాక్ గూడఛారి సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ ఏజెంట్ పట్టుపడ్డాడు. జాతీయ మీడియా కథనం ప్రకారం భారత రక్షణ ఆయుధాల పరిశోధన మరియు తయారి కేంద్రంలో ఉద్యోగిగా చేరిన ఏజెంట్ నిషాంత్ అగర్వాల్.. భారత అమ్ములపొదిలో కీలకమైన అస్త్రంగా ఉన్న బ్రహ్మోస్ తయారికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు రహస్యంగా పాక్ కు తెలియజేస్తున్నాడు. దీనిపై నిఘా పెట్టిన మహారాష్ట్ర, యూపీ జాయింట్ యాన్టీ టెర్రరిస్ట్ స్వాడ్ వల వేసి ఈ ఏజెంట్ ను సోమవారం పట్టుకుంది.
నిషాంత్ అగర్వాల్ పేరుతో ఉగ్యోగం చేరిన ఆ వ్యక్తి..గత కొన్ని రోజులుగా దొంగతనంగా భారత రక్షణా రంగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ కు చేరవేస్తున్నాడు. నిషాంత్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు..అతనిపై ప్రత్యేక నిఘా వేసి ఉంచారు. ఎట్టకేలకు యూపీ, మహారాష్ట్ర యాన్టీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వల వేసి అతన్ని రెడ్ హ్యాండెంట్ గా పట్టుకుంది. ఈ నేపథ్యంలో పట్టుబడ్డ ఏజెంట్ ఏఏ విషయాలు ఇక్కడ నుంచి చేరవేశాడనే సమచారం అతన్నుంచి రాబట్టినట్లు తెలిసింది. అలాగే ఇలాంటి ఏజెంట్లు మరెక్కడైన ఉన్నారేమోనని యాన్టీ స్క్వాడ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం గా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.