Isro 100 Test: ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ  ప్రయోగించిన రాకెట్‌ ప్రయోగం సక్సెస్ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇస్రోకు ఇది  100వ ప్రయోగం కావడం విశేషం. తాజాగా ప్రయోగం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్.. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం.. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు. ఇది కొత్తతరం నావిగేషన్‌ ఉపగ్రహాల్లో ఇది రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌కు ఇది మొదటి ప్రయోగం. దీంతో  ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలనూ దగ్గరుండి పర్యవేక్షించారు.


ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?


ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!


భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్‌ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతిక, విమానాల నిర్వహణ, మొబైల్‌ పరికరాల్లో లోకేషన్‌ ఆధారిత సేవలందించనుంది. ఇస్రో వందో ప్రయోగం విజయవంత కావడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు శాస్త్రవేత్తలను అభినందనలతో ముంచెత్తుతున్నారు. 


ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.