Isro maps: నిన్నటివరకూ విదేశీ యాప్‌లు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అంతా దేశీయమే. ట్విట్టర్‌కు పోటీగా నిన్న కూ యాప్. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌కు దీటుగా ఇస్రో మ్యాప్స్. ఏంటో చూద్దామా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో ఇప్పుడంతా మేకిన్ ఇండియా ( Make in india )నే. ప్రపంచ ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ ( Twitter )కు పోటీగా దేశీయంగా అభివృద్ధి చెందిన కూ యాప్ ( Koo app ) చర్చనీయాంశమైంది. వాట్సప్‌కు పోటీగా కూడా సందేశ్ అనే యాప్  అభివృద్ధి చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో యాప్ వస్తోంది. ఈసారి గూగుల్ ( Google )‌కు పోటీగా. తాజాగా మ్యాప్స్ సేవల్లో అగ్రగామిగా ఉన్న గూగుల్ మ్యాప్స్ ( Google Maps )‌కు పోటీగా దేశీయంగా అభివృద్ధి చెందుతున్న యాప్ వస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, మ్యాప్ మై ఇండియా ఈ యాప్ కోసం చేతులు కలిపాయి. 


పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో భారత వినియోగదారులకు గూగుల్ మ్యాప్స్‌ను తలదన్నే విధంగా సేవలందించడమే తక్షణ కర్తవ్యమని ఇస్రో ( ISRO ) స్పష్టం చేసింది. దీనికోసం ఇప్పటికే సీఇ ఇన్ఫో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ ఓ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. స్వదేశీ నావిగేషన్ సేవల్లో ఈ ఒప్పందం కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. మ్యాప్ మై ఇండియా ( Map my india )అనేది ఓ బాథ్యతాయుతమైన కంపెనీ అని..దేశ సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే విధంగా మ్యాప్స్ తయారు చేస్తున్నట్టు మ్యాప్ మై ఇండియా ప్రకటించింది. ఇస్రో ఉపగ్రహాల సమాచారంతో మరింత స్పష్టంగా మ్యాప్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ మ్యాప్ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని ఇస్రో కోరింది.


Also read: Aadhar card with Indane gas:ఆధార్ కార్డును ఇండేన్ గ్యాస్‌తో ఇలా లింక్ చేసుకోవాలి..లేదంటే సబ్సిడీ రాదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook