స్పేస్ టెక్నాలజీలో భారత్ ముందడుగు; 2021లో గగన్ యాన్
అంతరిక్షంలో సత్తా చాటుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ `ఇస్రో` మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది
బెంగళూరుం స్పేస్ టెక్నాలజీలో దూసుకుపోతున్న భారత్ మరో కీలక లక్ష్యం దిశగా సాగుతోంది. అగ్రరాజ్యాలతో సమానంగా సత్తా చాటుతూ ఇప్పటికే భారీ ఎత్తున అంతరిక్షంలోకి శాటిలైట్లను పంపుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' తాజాగా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గగన్ యాన్ మిషన్ ద్వారా 2021 డిసెంబర్ లో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడమే తమ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఇస్రో చీఫ్ కె.శివన్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంలో గగన్ యాన్ కు సంబంధించిన అనే విషయాలను వెల్లడించారు. గగన్ యాన్ ప్రాజెక్టు కార్యాచరణ మొదలైందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆరు ఇంక్యుబేషన్ సెంటర్లు, రీసర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు శివన్ తెలిపారు. గగన్ యాన్ కు సంబంధించిన ప్రారంభ శిక్షణ భారత్ లోనే ఉంటుందని... ఆ తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ రాష్యాలో ఉంటుందన్నారు. రెండు మానవ రహిత మిషన్లను డిసెంబర్ 2020, జూలై 2021లో నిర్వహిస్తామని... వ్యోమగాములతో కూడిన మిషన్ ను డిసెంబర్ 2021లో నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. మన వ్యోమగాముల్లో మహిళలు కూడా ఉంటారని పేర్కొన్నారు.