Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రునిపై మూడవ మిషన్ చేపట్టనుంది. ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 3ను 2022లో అంటే వచ్చే ఏడాది ప్రారంభించనుంది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ ఏమన్నారంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్థూలంగా ఇస్రో( ISRO). ఇప్పటికే చాలా రికార్డుల్ని సొంతం చేసుకుంది. అగ్రరాజ్యాల అంతరిక్ష పరిశోధన సంస్థలకు దీటుగా ప్రగతి సాధిస్తోంది. ఇప్పటికే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 (Chandrayaan 2) పేరిట రెండు మిషన్‌లను చంద్రునిపై ప్రయోగించింది ఇస్రో. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు అన్ని రంగాల్లోనూ ఇంచుమించు ఏడాది విలువైన కాలం వృధా అయిన పరిస్థితి. అదే పరిస్థితి ఇస్రోకు కూడా ఎదురైంది. 2020లో చేపట్టాల్సిన చంద్రునిపై మూడవ మిషన్ ( 3rd mission on moon) వాయిదా పడింది. వాయిదా పడిన చంద్రయాన్ 3 ( Chandrayaan 3) ను 2022లో ప్రయోగించనున్నామని ఇస్రో ఛైర్మన్ కే శివన్ ( Isro chairman k shivan) వెల్లడించారు. దీనికోసం చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్ నే చంద్రయాన్ -3లో ఉపయోగిస్తామని చెప్పారు. 2019లో చంద్రయాన్-2 మిషన్‌లో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ( Vikaram lander)చంద్రుని దక్షిణ ధృవంపై దిగడంలో విఫలమైన సంగతి తెలిసిందే. 


చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఇస్రో చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఎందుకంటే భవిష్యత్‌లో ఇస్రో చేపట్టనున్న గ్రహాంతర ప్రయోగాలకు చంద్రయాన్ 3 కీలకం కానుంది. మరోవైపు 2020 డిసెంబర్ నెలలో చేపట్టాల్సిన మొట్టమొదటి మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్టు ( Gaganyaan project)ను 2021 చివర్లో అంటే డిసెంబర్ నెలలో చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ తరువాత మరో మానవ రహిత మిషన్ ప్రయోగముంటుందని..మూడవ విడతలో ప్రధాన ప్రయోగం చేపట్టనున్నామని కే శివన్ తెలిపారు. గగన్‌యాన్ ద్వారా ముగ్గురు భారతీయుల్ని అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో. దీనికోసం ఎంపికైన పైలట్లు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు. మూడవ  విడత ప్రయోగించే గగన్‌యాన్ మాడ్యూల్‌కు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అవసరమని చెప్పారు. సరైన సమయంలో దీనికి సంబంధించిన  వివరాల్ని వెల్లడిస్తామన్నారు.


Also read: Income tax: ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్ ఇంకా దాఖలు చేయలేదా..ఇలా చేస్తే మరో అవకాశం మీ కోసం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook