Income tax: ఒకవేళ ఇప్పటివరకూ మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ దాఖలు చేయకపోతే..చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు కూడా అవకాశముంది. మార్చ్ 31 వరకూ ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి, 80 సిసిసి, 80 సిసిడి, 80 సిసిఇ, 80డి వంటి పలు సెక్షన్ల కింద పెట్టుబడులపై టాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు.
ఒకవేళ మీ ఏడాది జీతం 13 లక్లల కంటే తక్కువ ఉంటే..దాని కోసం పాత ట్యాక్స్ స్లాబ్‌ను ఎంచుకోవడమే లాభదాయకం. దీనికోసం 2020-21 ఆర్ధిక సంవత్సరం కోసం జూలై 31 వరకూ ఇన్‌కంటాక్స్ రిటర్న్ ఫైల్ చేసి...అందుకు తగ్గ సమాచారం సమర్పిస్తే రిఫండ్ పొందవచ్చు.
ఈ నేపధ్యంలో ఒకవేళ మీరు కేవలం ఉద్యోగం ద్వారానే సంపాదిస్తుంటే..మరే ఇతర ఆదాయం లేకపోతే ఏ ట్యాక్స్ స్లాబ్నైనా ఎంచుకోవచ్చు.
2020-21 ఆర్ధిక సంవత్సరపు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ట్యాక్స్ స్లాబ్ ప్రకటించారు. ఇందులో కావల్సిన ట్యాక్స్ స్లాబ్‌ను ఎంచుకునే ప్రత్యామ్నాయం కల్పించారు. ఈ నేపధ్యంలో ఉద్యోగులైతే ముందే వారి హెచ్ఆర్.. ఏ ట్యాక్స్ స్లాబ్ కావాలనేది అంగీకారం తీసుకుని ఉంటుంది.
అన్నింటి కంటే ముందుగా మీరు మార్చ్ 31 వరకూ మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పెట్టుబడుల రికార్డ్ ఉంచుకోండి. పిల్లల ఫీజు రసీదు, హోమ్ లోన్ స్టేట్మెంట్, భీమా ప్రీమియం రికార్డ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్ రికార్డ్, రెంట్ అగ్రిమెంట్ వంటి వాటిని ఇన్‌కంటాక్స్ రిటర్న్ దాఖలు చేసే సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు మార్చ్ 31 కంటే ముందు మీ టాక్స్ స్లాబ్ ప్రకారం ఏవైనా పెట్టుబడులుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఇవ్వడం ద్వారా ట్యాక్స్ రిఫండ్ పొందవచ్చు.