ISRO New Chief: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ సోమనాథన్ మరో నాలుగు రోజుల్లో రిటైర్ కానుండటంతో రెండేళ్ల కాలానికి వి నారాయణన్ నియామకమైంది. ఎవరీ నారాయణన్, ఈయన ప్రత్యేకతలేంటి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇస్రో ప్రస్తుత ఛైర్మన్ సోమనాథన్ పదవీకాలం జనవరి 13తో పూర్తి కానుంది. ఇస్రోలోనే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ వి నారాయణన్‌ను కొత్త ఛీఫ్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 14న ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇస్రోలో సోమనాథన్ తరువాత ఈయనే సీనియర్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. అంతరిక్షంలో శాటిలైట్లను తీసుకెళ్లేందుకు ఉపయోగించే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. శాటిలైట్ లాంచ్ వెహికల్స్, అందులో ఉపయోగించే కెమికల్స్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్, లిక్విడ్, సెమీ క్రయోజనిక్, క్రయోజనిక్ ప్రొపల్షన్ దశల్ని ఈయనే పర్యవేక్షిస్తుంటారు. 


జనవరి 13న రిటైర్ కాబోతున్న ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథన్ 2022 జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన హయాంలోనే ఇండియా తొలిసారిగా చంద్రుని దక్షిణ ధృవంపై రోవర్‌ని విజయవంతంగా లాంచ్ చేసింది. చంద్రునిపై రోవర్ విజయవంతంగా లాంచ్ చేసిన అమెరికా, రష్యా, చైనా సరసన చేరింది ఇండియా.


ఇస్రో కొత్త ఛైర్మన్ నేపధ్యం


తమిళ మీడియం స్కూల్‌లో ప్రాధమిక, హైస్కూల్ విద్యను అభ్యసించిన ఆయన క్రయోజనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డి చేశారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎంటెక్ ఫస్ట్ ర్యాంకర్ కూడా. రాకెట్ , అంతరిక్ష విమాన లాంచింగ్ టెక్నాలజీలో నైపుణ్యంతో 1984లో ఇస్రోలో చేరారు. ఆ తరువాత ఎదుగుతూ 2018 నుంచి ప్రస్తుతం ఉన్న హోదాలో ఉన్నారు. మరో రెండు విభాగాల్లో కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఛైర్మన్‌గా, చంద్రునిపై మనిషిని తీసుకెళ్లే స్పేస్ ఫ్లైట్ మిషన్ నేషనల్ లెవెల్ హ్యూమన్‌రేటెడ్ సర్టిఫైడ్ బోర్డ్ ఫర్ గగన్‌‌యాన్ చైర్మన్‌గా ఉన్నారు. 


Also read: BSNL Plans: మతిపోగొడుతున్న బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్, ఏడాదికి 321 రూపాయలే, తొలిసారిగా 425 రోజుల ప్లాన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.